‘కమ్మరాజ్యం..’ సంగతేంటి?.. ఆర్జీవీ ఏం చేయబోతున్నాడు!?
- IndiaGlitz, [Tuesday,December 03 2019]
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ వివాదాల్లో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై కేసులు, కోర్టులో పిటిషన్లు అయిపోయాయ్. సినిమా పేరు మారుస్తానని చెప్పినప్పటికీ కోర్టు అస్సలు విన్లేదు.! అంతేకాదు సెన్సార్ బోర్డు అయినా సర్టిఫికెట్ ఇస్తుందిలే కచ్చితంగా సినిమా రిలీజ్ చేసుకోవచ్చని వర్మ ఆశించాడు. అయితే సర్టిఫికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని సెన్సార్ బోర్డు తేల్చిచెప్పడంతో.. ఆర్జీవీ ఆశలన్నీ అడియాసలయ్యాయి. సినిమాలు సీన్లు కట్ చేస్తే పరిస్థితేంటి..? అసలు విషయాలన్నీ కట్ అయితే సినిమా చూసేదెవరు..? సినిమాకు ఊపిరిగా, బ్యాక్‌బోన్‌గా ఉండే ప్లస్ పాయింట్లన్నీ పోతే సినిమా సంగతేంటి..? అనేది ఇప్పుడు నెట్టింట్లో.. ఆర్జీజీ అభిమానుల్లో చర్చనీయాంశమైంది.
ఆర్జీవీ మదిలో ఏముంది!?
సినిమా ఆపేస్తే ఖర్చు పెట్టిన డబ్బులు రావ్..? పోనీ ఇంతకు మించి డేర్ చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అదీ కాకుండా సుప్రీం కోర్టుకు పోయినా మొట్టికాయలు తప్పవని భావించిన ఆర్జీవీ.. ఏం చేద్దాం..? ఎలా ముందుకెళ్లాలి..? అని నిశితంగా ఆలోచించి ఫైనల్‌గా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదివరకే తాను తెరకెక్కించి రిలీజ్ చేసిన పోర్న్‌స్టార్ మియా మాల్కోవా ‘జీఎస్‌టీ’లాగే.. ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ రిలీజ్ చేయాలని నిర్ణయించారని విశ్వసనీయవర్గాల సమాచారం. కాగా జీఎస్‌టీ చూసిన ఔత్సాహికులంతా డబ్బులు చెల్లించే చూశారు గనుక.. ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ కు కూడా అలానే కలెక్షన్స్ రాబట్టుకోవచ్చని ఆర్జీవీ అనుకుంటున్నారని లీకులొచ్చాయ్!. మరి ఇది ఎంతవరకు నిజమో..? అసలు ఆర్జీవీ మదిలో ఏముంది..? సినిమా థియేటర్లలో వస్తుందా..? యూట్యూబ్‌లో వస్తుందా..? లేకుంటే ఇది కూడా మరో జీఎస్‌టీ లాగా అవుతుందా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు మరి.