చరణ్ ఫ్యాన్స్ తో రేష్మి గొడవేంటి..?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ధృవ. ఈ చిత్రం ఈనెల 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. ధృవ ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో 10.57 కోట్లు షేర్ సాధించినట్టు సమాచారం. ఇదిలా ఉంటే...సోషల్ మీడియాలో ధృవ కలెక్షన్స్ విషయమై చరణ్ ఫ్యాన్స్ కి యాంకర్ రేష్మికి మధ్య వార్ నడుస్తుంది. ఇంతకీ ఏం జరిగింది అంటే...ఎవరో ఓ వ్యక్తి రేష్మి నటించిన గుంటూరు టాకీస్ విజయవాడలో ఫస్ట్ డే 17 లక్షలు వసూలు చేసింది. రామ్ చరణ్ ధృవ విజయవాడలో ఫస్ట్ డే 14 లక్షలు వసూలు చేసింది అంటూ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ ను రేష్మి రీట్వీట్ చేస్తూ ఫన్ గా తీసుకున్నాను అంది.
రేష్మి రీట్వీట్ పై చరణ్ ఫ్యాన్ ఫైర్ అవుతూ ఎవడో దురాభిమాని ట్వీట్ చేస్తే ఎంజాయ్ చేస్తున్నావా అని రేష్మిని ప్రశ్నించాడు. దీనికి రేష్మి స్పందిస్తూ...ఏది జోక్ గా తీసుకోవాలో నాకు తెలుసు నా ఇష్టం అంటూ కాస్త ఘాటుగానే సమాధానం చెప్పింది. చరణ్ ఫ్యాన్స్ రేష్మి మధ్య వార్ ఇంతటితో ఆగలేదు. నాన్ కమ్మ హీరోలను తక్కువుగా చూస్తున్నావ్ అని చరణ్ ఫ్యాన్ అంటే...కులాల గురించి చిన్నప్పుడు స్కూల్ పుస్తకాల్లో చదువుకున్నాను. కులాల గురించి మాట్లాడుతున్నావ్ మనం ఏ కాలంలో ఉన్నాం. మాకు పని ఉంది బాధ్యత ఉంది దీనిని ఇక్కడితో ఆపితే మంచిది అని చెప్పింది. మరి...చరణ్ ఫ్యాన్స్ తో రేష్మి మాటల యుద్దం ఎంత వరకు వెళుతుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com