రజనీకాంత్ కు అక్కడేం పని....

  • IndiaGlitz, [Tuesday,November 15 2016]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్‌, ఎమీజాక్స‌న్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం '2.0' సీక్వెల్ ఆఫ్ రోబో. సినిమా ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. అక్ష‌య్‌కుమార్ ఇందులో విల‌న్‌గా న‌టిస్తుండ‌టం విశేషం. 2010లో ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్‌ల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన బ్లాక్‌బ‌స్ట‌ర్ రోబో సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మిస్తుంది. రీసెంట్‌గా చెన్నైలోని మిల‌ట‌రీ క్యాంప్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న ఈ చిత్రం ఇప్పుడు షోలింగ‌ర్‌లోని ఐటీ పార్క్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఐటీ పార్క్‌లో ఓ ఫ్లోర్ మొత్తాన్ని లీజుకు తీసుకుని అక్క‌డ చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్నారు. వ‌చ్చే ఏడాది సినిమా విడుద‌ల ఉంటుంది. న‌వంబ‌ర్ 20న సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేయ‌నున్నారు.