ఎన్టీఆర్ మాటల వెనక మర్మం ఇదే..
- IndiaGlitz, [Wednesday,August 31 2016]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ రేపు (సెప్టెంబర్ 1న) రిలీజ్ అవుతుంది. ఎన్టీఆర్ తదుపరి చిత్రాన్నిరచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయనున్నట్టు గతంలో ప్రకటించారు. అయితే...జనతా గ్యారేజ్ ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఎన్టీఆర్ తదుపరి చిత్రం విషయంలో ఇంకా చర్చల దశలోనే ఉంది. ఏ నిర్ణయం తీసుకోలేదు. జనతా గ్యారేజ్ రిలీజ్ తర్వాత రెండు నెలలు విశ్రాంతి తీసుకుంటాను. ఆతర్వాతే తదుపరి చిత్రం ఎవరితో అనేది నిర్ణయిస్తాను అని చెప్పాడు.
ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే...జనతా గ్యారేజ్ అనుకున్న విధంగా ఘన విజయం సాధిస్తే...డైరెక్షన్ కి కొత్తవాడైన వక్కంతం వంశీతో ధైర్యంగా సినిమా చేయచ్చు. ఒకవేళ గ్యారేజ్ గాడితప్పితే...అప్పుడు వంశీతో చేయడం కన్నా...పూరితో చేయడం బెటర్ అనే ఆలోచనలో ఉన్నాడట యంగ్ టైగర్. అందుకనే జనతా గ్యారేజ్ రిలీజ్ తర్వాత తదుపరి చిత్రం ఎవరితో అనేది నిర్ణయిస్తాను అని చెబుతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. మరి...ఎన్టీఆర్ మాటల వెనక మర్మం ఇదేనా..?