కౌశల్ బతుకు ఎంత? వీడికి ఆర్మీనా?.. నీ పనైపోయింది!
- IndiaGlitz, [Thursday,March 07 2019]
గత కొన్ని రోజులుగా బిగ్‌బాస్-2 విజేత కౌశల్‌కు కౌశల్ ఆర్మీకి మధ్య వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కౌశల్ బిగ్‌బాస్ కాదు 'బిగ్ బోగస్' అని పైసా కూడా ఖర్చుపెట్టడని ఆయన పేరుతో ఉండే ఫౌండేషన్ కూడా పెద్ద ఫ్రాడ్ అని అభిమానులు, కౌశల్ ఆర్మీ సంచలన ఆరోపణలు చేసింది. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చిన కౌశల్ అతని భార్య వివరణ ఇచ్చుకున్నారు.
అయినప్పటికీ ఆయనపై ట్రోలింగ్స్ మాత్రం ఆగట్లేదు. ఇప్పుడీ వివాదం సోషల్ మీడియా.. మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా ఈ వ్యవహారంపై సినీ నటుడు, వైసీపీ ప్రధాన కార్యదర్శి థర్టీ ఇయర్స్ పృథ్వీ స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ యూ ట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీ మాట్లాడుతూ కౌశల్ వ్యవహారంపై స్పందించారు.
అసలు ఎవడ్రా నువ్..
కౌశల్ ఆర్మీనా? అసలు ఎవడ్రా నువ్.. నీదో తొక్కలో ఆర్మీ. ఆర్మీ అనే పదాన్ని వాడటం తప్పు. భారతదేశ చరిత్రలో సైనిక దళానికి వాడే పదం అది. ఇండియన్ ఆర్మీ అదో గౌరవ సూచికం. ఇప్పుడు ప్రతివాడికి ఆర్మీనే. అసలు ఎవడు నువ్. పవన్ కళ్యాణ్ నన్ను గెలిపించేశారు అంటున్నావ్.. నువ్ ఏదో మాట్లాడుతున్నావ్ అని వాళ్లు నిన్ను ఫోకస్ చేస్తున్నారు. నీకు అంత సీన్ లేదు.. బిగ్ బాస్ ఓటింగ్ అప్పుడు తనీష్ అనే అబ్బాయికి ఓట్ చేయాలని నేను కోరాను. ఎందుకంటే అతను చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో నాకు తెలుసు. వాళ్ల నాన్నగారు అనుకోకుండా మేడమీద నుండి పడిపోయి చనిపోయారు. ఆయన్ని సపోర్ట్ చేస్తే హెల్ప్ చేసిన వాళ్లము అవుతామని ఆయన్ని విన్నర్ చేయండి. ఈ తొక్కలో ఆర్మీలు గీర్మీలు కాదు. ఆర్మీలు పెట్టిన వాళ్లు ఈరోజు రోడ్డుకి వచ్చారు అని ఆయన ఇంటర్వ్యూలో ఆగ్రహంతో ఊగిపోయారు.
ఆ బుడబుక్కలోడికి తోడు ఈడొకడు..?
మొన్న వాడెవడో అన్నాడు.. పాకిస్థాన్‌కి ఫోన్ చేసి యుద్ధం ఆపించేశా అని (కేఏ పాల్).. ఆ బుడబుక్కలోడితో పాటు ఈ బుడబుక్కలోడు తయారయ్యాడు. కాకపోతే వీడు కాస్త అందంగా కనిపిస్తాడు.. వాడు దిష్టిబొమ్మలా ఉంటాడు అంతే తేడా అని కౌశల్‌ను పాల్‌తో పోల్చాడు పృథ్వీ. కాగా.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆఫీస్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని.. అక్కడికెళ్లి చర్చలు జరుపుదామంటే ప్రధాని మోదీ అడ్డుకుంటున్నారని రెండ్రోజుల క్రితం కేఏ పాల్ పెద్ద హడావుడి చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.
వాడి బతుకెంత..!?
తిప్పికొడితే కౌశల్ అనే వాడి బతుకు ఎంత? వీడికి ఆర్మీనా? ముందు ఆర్మీ అనే పదాన్ని తొలగించండి. తనీష్, బాబుగోగినేనిల గురించి కౌశల్ మాట్లాడటానికి అతనికి ఏం అర్హత ఏం ఉంది. కౌశల్ భార్య ఏడుపుని నమ్మాల్సిన అవసరం లేదు. అవన్నీ పెయిడ్ ఏడుపులే. ఇలాంటి వాళ్లని చాలా మందిని చూశాను. కౌశల్ ఆర్మీ పళ్లు పంచింది.. బ్లడ్ డొనేట్ చేశాం అంటే అలాంటివి అందరూ చేస్తారు. దానికంత పబ్లిసిటీ అవసరంలేదు. నీది దొంగనాటకానికి, అబద్దాలకి జనం ఓట్లు వేయడంతో నీకు డబ్బులు ఇచ్చారు.. అదో పెద్ద కిరీటం కాదు. పనీపాటాలేని వాళ్లు అతన్ని మోస్తున్నారు తప్ప ఇప్పుడు కౌశల్‌కి అంత సీన్ లేదు అతని పని అయిపోయింది అని థర్టీ ఇయర్స్ పృథ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పై నెటిజన్లు కన్నెర్ర
కాగా.. వైసీపీలో పదవి వచ్చినప్పట్నుంచి పృథ్వీ తన మాటలకు స్పీడ్ పెంచారని.. అప్పట్లో మెగా బ్రదర్ నాగబాబుపై కూడా ఆరోపణలు చేసి క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారని నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు. కౌశల్‌కు సొంత ఇండస్ట్రీ వ్యక్తే ఈ రేంజ్‌లో రెచ్చిపోవడం గమనార్హం. ఆయన తప్పు చేశాడో లేదో అన్నది దేవుడికెరుక. నిజానిజాలు తెలుసుకోకుండానే కౌశల్‌పై ఈ రేంజ్‌లో పడటం ఎంత వరకు సమంజసం సార్.. అంటూ నెటిజన్లు, కౌశల్ అభిమానులు పృథ్వీపై కన్నెర్రజేస్తున్నారు. అయితే ఈ సంచలన ఆరోపణలపై కౌశల్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో వేచి చూడాల్సిందే మరి.