B-Form: బీ-ఫారం అంటే ఏమిటి..? బీ-ఫారం లేకపోతే ఏమౌతుంది..?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించి వారికి బీఫాంలు అందిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత తమ పార్టీ అభ్యర్థులకు బీ-ఫారంలు అందజేశారు. అయితే చాలా మంది ఈ బీ-ఫారం అంటే ఏంటి.. ఎందుకు ఇస్తారో తెలియదు.
బీ-ఫారం అంటే..
సాధారణంగా గుర్తింపు పొంది జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీలు తమ అభ్యర్థులకు బీ-ఫారంలు ఇస్తుంటాయి. వీరు తమ పార్టీ తరపున అధికారికంగా పోటీ చేస్తున్నారని.. ఈ ఫారంలో పేర్కొన్న అభ్యర్థిని తమ పార్టీ అభ్యర్థిగా గుర్తించాలని ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేస్తారు. నామినేషన్ పత్రాలతో పాటు ఆ పార్టీ అధ్యక్షులు సంతకం చేసిన ఈ బీ-ఫారం అధికారికి సదరు అభ్యర్థి అందజేస్తారు. దీంతో ఈ ఫారంను పరిశీలించిన అధికారులు సంబంధిత అభ్యర్థికి ఆ పార్టీ ఎన్నికల గుర్తును కేటాయిస్తారు. ఈ బీ-ఫారం లేకపోతే ఎన్నికల గుర్తు కేటాయించరు. కొంత మంది అదే పార్టీ తరపున నామినేషన్ వేసినా బీ ఫారం ఉండదు. దాంతో ఆ అభ్యర్థులను స్వతంత్ర అభ్యర్థులుగా గుర్తించి వేరు గుర్తు కేటాయిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు పార్టీ గుర్తులను కేటాయించరనే విషయం తెలిసిందే.
ఏ-ఫారం అంటే..
ఇక అభ్యర్థులకు బీ-ఫారం అందించే వ్యక్తికి ఏఫాం అందిస్తారు. పార్టీ ఎవరినైతే ఎంపిక చేసి ఏ ఫారం అందిస్తుందో వారు మాత్రమే తమ పార్టీ అభ్యర్థులకు బీఫాం అందజేయాలి. అంటే ఏ-ఫారంఅందుకున్న ఆ వ్యక్తి ఆ ఏఫాంను ఎన్నికల అధికారులకు అందజేస్తారు. సాధారణంగా పార్టీ అధ్యక్షులకే ఏ-ఫారం ఇచ్చే అధికారం ఉంటుంది. ఏ-ఫారంలో పేర్కొన్న నేత సంతకంతో జారీ చేసిన బీ ఫారంలకు మాత్రమే ఎన్నికల అధికారులు ఆమోదం తెలుపుతారు.
అభ్యర్థులకు బీ-ఫారంలు అందజేత..
ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ అభ్యర్థులకు బీ-ఫారంలు అందజేశారు. బీ-ఫారంలతో పాటు ఎన్నికల ఖర్చులకు రూ.40లక్షల చెక్కును కూడా కేసీఆర్ అందించారు. అయితే 115 మంది అభ్యర్థుల్లో కేవలం 51 మందికే కేసీఆర్ బీ-ఫారమ్స్ అందజేయడం చర్చనీయాంశంగా మారింది. ముందుగా ప్రకటించిన తొలి జాబితాలో కొంతమంది అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మిగిలిన అభ్యర్థులకు రెండు మూడు రోజుల్లో బీ-ఫారంలు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com