B-Form: బీ-ఫారం అంటే ఏమిటి..? బీ-ఫారం లేకపోతే ఏమౌతుంది..?

  • IndiaGlitz, [Monday,October 16 2023]

తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించి వారికి బీఫాంలు అందిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత తమ పార్టీ అభ్యర్థులకు బీ-ఫారంలు అందజేశారు. అయితే చాలా మంది ఈ బీ-ఫారం అంటే ఏంటి.. ఎందుకు ఇస్తారో తెలియదు.

బీ-ఫారం అంటే..

సాధారణంగా గుర్తింపు పొంది జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీలు తమ అభ్యర్థులకు బీ-ఫారంలు ఇస్తుంటాయి. వీరు తమ పార్టీ తరపున అధికారికంగా పోటీ చేస్తున్నారని.. ఈ ఫారంలో పేర్కొన్న అభ్యర్థిని తమ పార్టీ అభ్యర్థిగా గుర్తించాలని ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేస్తారు. నామినేషన్ పత్రాలతో పాటు ఆ పార్టీ అధ్యక్షులు సంతకం చేసిన ఈ బీ-ఫారం అధికారికి సదరు అభ్యర్థి అందజేస్తారు. దీంతో ఈ ఫారంను పరిశీలించిన అధికారులు సంబంధిత అభ్యర్థికి ఆ పార్టీ ఎన్నికల గుర్తును కేటాయిస్తారు. ఈ బీ-ఫారం లేకపోతే ఎన్నికల గుర్తు కేటాయించరు. కొంత మంది అదే పార్టీ తరపున నామినేషన్‌ వేసినా బీ ఫారం ఉండదు. దాంతో ఆ అభ్యర్థులను స్వతంత్ర అభ్యర్థులుగా గుర్తించి వేరు గుర్తు కేటాయిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు పార్టీ గుర్తులను కేటాయించరనే విషయం తెలిసిందే.

ఏ-ఫారం అంటే..

ఇక అభ్యర్థులకు బీ-ఫారం అందించే వ్యక్తికి ఏఫాం అందిస్తారు. పార్టీ ఎవరినైతే ఎంపిక చేసి ఏ ఫారం అందిస్తుందో వారు మాత్రమే తమ పార్టీ అభ్యర్థులకు బీఫాం అందజేయాలి. అంటే ఏ-ఫారంఅందుకున్న ఆ వ్యక్తి ఆ ఏఫాంను ఎన్నికల అధికారులకు అందజేస్తారు. సాధారణంగా పార్టీ అధ్యక్షులకే ఏ-ఫారం ఇచ్చే అధికారం ఉంటుంది. ఏ-ఫారంలో పేర్కొన్న నేత సంతకంతో జారీ చేసిన బీ ఫారంలకు మాత్రమే ఎన్నికల అధికారులు ఆమోదం తెలుపుతారు.

అభ్యర్థులకు బీ-ఫారంలు అందజేత..

ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ అభ్యర్థులకు బీ-ఫారంలు అందజేశారు. బీ-ఫారంలతో పాటు ఎన్నికల ఖర్చులకు రూ.40లక్షల చెక్కును కూడా కేసీఆర్ అందించారు. అయితే 115 మంది అభ్యర్థుల్లో కేవలం 51 మందికే కేసీఆర్ బీ-ఫారమ్స్ అందజేయడం చర్చనీయాంశంగా మారింది. ముందుగా ప్రకటించిన తొలి జాబితాలో కొంతమంది అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మిగిలిన అభ్యర్థులకు రెండు మూడు రోజుల్లో బీ-ఫారంలు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

More News

Chandrababu:చంద్రబాబుకు హైకోర్టులో మరోసారి ఊరట.. ఐఆర్ఆర్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో మరోసారి స్వల్ప ఊరట దక్కింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో

Saindhav:'ఈసారి లెక్క మారుద్ది' అంటున్న వెంకీ మామ.. యాక్షన్ థ్రిల్లర్‌గా 'సైంధవ్' టీజర్‌..

టాలీవుడ్ సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ చాలా కాలం తర్వాత సోలో హీరోగా నటిస్తున్న చిత్రం 'సైంధవ్'.

Prithviraj:ప్రభాస్ 'సలార్' మూవీ నుంచి పృథ్వీరాజ్ కొత్త పోస్టర్ విడుదల..

దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న మూవీల్లో 'సలార్' ఒకటి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో

CM Jagan:డిసెంబర్‌లోపు విశాఖ నుంచే పరిపాలన.. సీఎం జగన్ క్లారిటీ..

విశాఖపట్టణం నుంచి పరిపాలనపై సీఎం జగన్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ లోపు తాను వైజాగ్ నుంచే పాలన చేయనున్నట్లు తెలిపారు.

Former Bhadrachalam MLA:తెలంగాణ బీజేపీలో విషాదం.. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకురాలు కుంజా సత్యవతి కన్నుమూశారు.