96... క‌న్న‌డలో 99... మరి తెలుగులో...

  • IndiaGlitz, [Wednesday,December 12 2018]

త‌మిళంలో ఇటీవ‌ల విడుద‌లైన ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం '96'. విజ‌య్ సేతుప‌తి, త్రిష జంట‌గా న‌టించారు. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌డానికి దిల్‌రాజు హ‌క్కుల‌ను పొందారు. ముందుగా నాని, స‌మంత ఈ రీమేక్‌లో న‌టిస్తార‌ని వార్త‌లు వినిపించాయి.

ఆ త‌ర్వాత త‌మిళంలో న‌టించిన త్రిష పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. గోపీచంద్ పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు టాక్‌. కాగా ఈ సినిమా క‌న్న‌డ రీమేక్‌కు రంగం సిద్ధ‌మైంది.

క‌న్న‌డంలో ఈ సినిమాను 99 అనే పేరుతో రీమేక్ చేయ‌బోతున్నారు. గ‌ణేశ్‌, భావ‌న జంట‌గా న‌టించారు. ప్రీతం గ‌బ్బి డైరెక్ట్ చేయ‌బోతున్నారు. మ‌రి తెలుగులో ఏ టైటిల్‌తో సినిమాను తెర‌కెక్కిస్తారో చూడాలి.