మహేష్ అయితే ఏంటి..?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన `శ్రీమంతుడు` చిత్రం మహేష్ కెరీర్లో బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. ఇప్పుడు ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. ఈ విషయాన్ని పక్కన పెడితే, శ్రీమంతుడు విడుదల తర్వాత అసలు శ్రీమంతుడు కథ నాదే అంటూ శరత్ చంద్ర అనే వ్యక్తి కేసు వేసిన సంగతి తెలిసిందే.
స్వాతి వీక్లిలో 2012లో తాను రాసిన చచ్చేంత ప్రేమ నవలను కాపీ చేసే శ్రీమంతుడు సినిమా చేశారనేది కేసు. నాంపల్లి కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. అయితే ఈ కేసుకు సంబంధించిన దర్శక నిర్మాతలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. నిర్మాతల్లో మహేష్ కూడా ఒకరు కావడంతో, మహేష్ కూడా కోర్టుకు హాజరు కావాల్సిందేనని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన స్థానంలో మరొకరు కోర్టుకు హాజరవుతారని మహేష్ కోర్టుకు చేసిన అభ్యర్థనను కోర్టు తోసి పుచ్చి, కోర్టుకు హాజరుకావాల్సిందేనని తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments