బోయపాటి విషయంలో జరిగిందిదా?
Send us your feedback to audioarticles@vaarta.com
స్టార్ డైరెక్టర్‌గా బోయపాటి శ్రీను పదిహేను కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న సమయంలో ఆయనకు `వినయవిధేయరామ` పెద్ద షాక్ ఇచ్చింది. తన సినిమా విషయంలో బోయపాటి తనకే ఎక్కువ క్రెడిట్ రావాలనుకోవడమే ఇప్పుడు అసలు తన సమస్యకు కారణమై కూర్చుంది. భారీగా సినిమాకు ఖర్చు చేయించడం.. సినిమా అనుకున్న మేర సక్సెస్ కాకపోవడంతో నిర్మాత దానయ్య బోయపాటితో గొడవే పడ్డాడు. డిస్ట్రిబ్యూటర్స్‌కు ఇస్తానన్న 5 కోట్ల రూపాయలను కూడా ఇవ్వనని బోయపాటి నిర్మాతకు చెప్పేశాడు.
ఈ గొడవ వ్యవహారం పెద్ద స్థాయిలో జరగడంతో.. బోయపాటి ఇమేజ్‌కు డ్యామేజ్ వచ్చింది. ఇప్పుడు ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదనే విషయం కూడా తెలిసిందే. బోయపాటి తదుపరి బాలయ్య సినిమా తమ సంస్థలో చేయాలని.. కనీసం నిర్మాణంలో అయినా భాగస్వామ్యం కావాలని మైత్రీ సంస్థ భావించి బోయపాటికి అడ్వాన్స్ ఇచ్చింది. కానీ బాలయ్య తనే స్వయంగా సినిమాను నిర్మిస్తుండటం.. ఇతర సంస్థలతో భాగస్వామ్యం కావాలనుకోకపోవడంతో బోయపాటికి సమస్య వచ్చి పడింది. మైత్రీ సంస్థ తాము ఇచ్చిన అడ్వాన్స్‌ను వడ్డీతో సహా ఇచ్చేయమని అడుగుతుందట. దీంతో బోయపాటికి ఏం చేయాలో పాలు తెలియక.. మైత్రీ సంస్థకు చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేశాడని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments