రజనీకాంత్ కి అసలు ఏమైంది..
Tuesday, July 5, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సంచలన చిత్రం కబాలి. ఈనెలలోనే కబాలి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.మరో వైపు రజనీకాంత్ గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రోబో 2.0 చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటి వరకు రోబో 2.0 50% షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే...సడన్ గా రజనీకాంత్ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి అమెరికా వెళ్లారు. రజనీకాంత్ అమెరికా వెళ్లడానికి కారణం ఆయన ఆరోగ్యం సరిగా లేదని అందుకనే అమెరికా వెళ్లారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలతో రజనీ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అభిమానులతో పాటు గ్రేట్ శంకర్ కూడా టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే అత్యంత భారీ బడ్జెట్ తో రోబో 2.0 తెరకెక్కిస్తున్నారు. అయితే...రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ ఈ వార్తలపై స్పందిస్తూ...రజనీకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లారు. పుకార్లను నమ్మద్దు. కబాలి రిలీజ్ టైమ్ కి చెన్నై చేరుకుంటారు అని తెలియచేసారు.
ఇటీవల రోబో 2.0 చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్ క్రియేటివ్ హెడ్ రాజు మహా లింగంకి రజనీ ఫోన్ చేసారట. ఈ విషయాన్ని లైకా క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ....రజనీకాంత్ ఫోన్ చేసారు. ఆయనతో ఫోన్ లో మాట్లాడుతుంటే సింహం గర్జించినట్టు అనిపించింది. ఇకనైనా పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాస్తారని ఆశిస్తున్నాను అంటూ స్పందించారు. రజనీకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారని ఎంత మంది చెబుతున్నా రజనీకాంత్ కు కిడ్నీ ఆపరేషన్ జరిగిందని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే...తాజాగా కోలీవుడ్ లో మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. అది ఏమిటంటే...రోబో 2.0లో రజనీకాంత్ రోబోగా కనిపించే కాస్ట్యూమ్స్ ధరించారట. ఆ కాస్ట్యూమ్స్ దాదాపు 40 కేజీల బరువు ఉన్నాయట. సమ్మర్ లో అంత బరువు కాస్ట్యూమ్స్ ధరించి షూటింగ్ చేయడం వలనే రజనీ అనారోగ్యానికి గురయ్యారని అంటున్నారు. అందుకనే కాస్ట్యూమ్స్ డిజైనర్ తో బరువు తగ్గించమని శంకర్ చెప్పినట్టు సమాచారం. ఏది ఏమైనా..రజనీకాంత్ ఆరోగ్యంగా ఉండాలి..మరెన్ని సినిమాలు చేయాలని కోరుకుందాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments