అమితాబ్‌కు ఏం జరిగింది?
- IndiaGlitz, [Tuesday,March 13 2018]
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్‌కు ఏం జరిగింది?... అనే ప్రశ్న ఆయన అభిమానులను వేధిస్తుంది. ఎందుకంటే.. ఆయన బ్లాగ్‌లో ఆయన ఇచ్చిన సమాచారం అలా ఉంది. నేను డాక్టర్లను కలవబోతున్నాను. వారు నన్ను మామూలుగా చేస్తారు.
రేపు మళ్లీ మిమ్మల్ని మరిన్ని అప్డేట్స్తో కలుస్తాను అంటూ అమితాబ్ ఇచ్చిన మెసేజ్ ఆయనకు షూటంగ్‌లో ఏమైనా గాయాలు తగిలాయా? అనే అనుమానం వస్తుంది.
అమితాబ్, ఆమిర్ ఖాన్ కలిసి 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ విషయమై రేపు యూనిట్ వర్గాలు ఏమని స్పందించనున్నారో తెలియాలంటే ఆగాల్సిందే మరి.