అమితాబ్‌కు ఏం జ‌రిగింది?

  • IndiaGlitz, [Tuesday,March 13 2018]

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్‌కు ఏం జ‌రిగింది?... అనే ప్ర‌శ్న ఆయ‌న అభిమానుల‌ను వేధిస్తుంది. ఎందుకంటే.. ఆయ‌న బ్లాగ్‌లో ఆయ‌న ఇచ్చిన స‌మాచారం అలా ఉంది. నేను డాక్ట‌ర్ల‌ను క‌ల‌వ‌బోతున్నాను. వారు న‌న్ను మామూలుగా చేస్తారు.

రేపు మ‌ళ్లీ మిమ్మ‌ల్ని మ‌రిన్ని అప్‌డేట్స్‌తో క‌లుస్తాను అంటూ అమితాబ్ ఇచ్చిన మెసేజ్ ఆయ‌న‌కు షూటంగ్‌లో ఏమైనా గాయాలు త‌గిలాయా? అనే అనుమానం వ‌స్తుంది.

అమితాబ్‌, ఆమిర్ ఖాన్ క‌లిసి 'థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్‌' సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రి ఈ విష‌య‌మై రేపు యూనిట్ వ‌ర్గాలు ఏమ‌ని స్పందించ‌నున్నారో తెలియాలంటే ఆగాల్సిందే మ‌రి.

More News

బాల‌య్య‌తో బాలీవుడ్ బ్యూటీ...

బాల‌కృష్ణ రూపొందుతోన్న 103వ చిత్రం 'య‌న్టీఆర్‌'. త‌న తండ్రి, మాజీ ముఖ్య‌మంత్రి జీవిత‌గాథ‌లో నటుడు నుండి ముఖ్య‌మంత్రి వ‌ర‌కు అయ్యే వ‌ర‌కు ఉన్న ఘ‌టాల‌ను ఆధారంగా చేసుకుని బ‌యోపిక్‌ను రూపొందిస్తున్నారు. ఈ సినిమాను తేజ తెర‌కెక్కిస్తున్నాడు.

ఆగ‌స్టులో రానున్న వెంకీ, తేజ చిత్రం

సీనియ‌ర్ క‌థానాయ‌కుడు విక్ట‌రీ వెంక‌టేష్‌, ద‌ర్శ‌కుడు తేజ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రానున్న సంగ‌తి తెలిసిందే. శ్రియ క‌థానాయిక‌గా న‌టించ‌నున్న ఈ చిత్రంలో యువ క‌థానాయ‌కుడు నారా రోహిత్ ఓ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. అత‌ని స‌ర‌స‌న ఈషా రెబ్బా న‌టించ‌నుంది.

'మ‌హిళా క‌బ‌డ్డి' చిత్రంలోని ఫ‌స్ట్ సాంగ్ లాంచ్‌

ఆర్.కె. ఫిలింస్ ప‌తాకంపై ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తోన్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'మ‌హిళా క‌బ‌డ్డి'.  ర‌చన స్మిత్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోంది. ఇటీవ‌లే మూడ‌వ‌ షెడ్యూల్ షూటింగ్  పూర్తి చేసుకుంది.

మార్చి 23న గులేబకావళి

ప్రభుదేవా, హన్సిక జంటగా నటించిన తమిళ చిత్రం గులేబకావళి. కల్యాణ్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటి రేవతి ఓ శక్తివంతమైన పాత్రలో నటించారు. తమిళనాట సంక్రాంతికి విడుదలైన ఈచిత్రం అక్కడ  ఘన విజయాన్ని నమోదు చేసుకుంది.

ఈ అభినందన నన్ను ఆనందంలో ముంచెత్తింది - చంద్ర బోస్

నేను నా సాహితీ ప్రస్థానంలో ఎన్నో పాటలు రాసాను-ఎన్నో పురస్కారాలు ,అభినందనలు అందుకున్నాను-కాని ఈ ఎంత సక్కగున్నావే పాటకు వస్తున్న స్పందన మాత్రం అపూర్వం.