close
Choose your channels

Vision 2020:విజన్ 2020లో జరిగింది ఇదే.. అప్పుడు ధ్వంసం బ్యాలెన్స్, 2047తో సంపూర్ణ విధ్వంసమే

Thursday, August 17, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడానికి ముందుంటారు. హైదరాబాద్‌ను నేనే కట్టా, సెల్‌ఫోన్‌ను నేనే తెచ్చా, సత్యనాదెళ్ల నా వల్లే అమెరికాకు వెళ్లాడు ఇలా ఒకటనికాదు.. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ తను ఎంతటి మేథావినో, సమాజాన్ని తాను ఎంతగా మార్చనో చెప్పుకుంటూ వుంటారు. ప్రజలు అమాయకులని, వాళ్లకు జ్ఞాపకశక్తి అంతగా వుండదని ఆయన ఫీలింగ్ ఏమో మరి.. అంతేకాదు ఒక అబద్ధాని పదిసార్లు చెబితే నిజమైపోతుందని భావిస్తారేమో కానీ మైక్ అందుకున్నారంటే నేను అది.. నేను ఇది అంటూ బిల్డప్‌లు ఇస్తారు.

ఇండియా విజన్ 2047 ప్రకటించిన చంద్రబాబు :

ఏపీలో ఎన్నికలకు కొద్దినెలలు మాత్రమే సమయం వుండటంతో టీడీపీకి ఎలాగైనా జవసత్వాలు అందించాలనే ఉద్దేశంతో చంద్రబాబు తెగ కష్టపడుతున్నారు. జిల్లాల టూర్‌లు, ప్రాజెక్ట్‌ల సందర్శన పేరుతో జనంలో తిరుగుతున్నారు. ఇక స్వాతంత్ర్య దినోత్సవాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్న ఆయన విశాఖ బీచ్ రోడ్‌లో రెండున్నర కిలోమీటర్ల పాటు జాతీయ సమైక్యత పాదయాత్ర చేశారు. అది ముగిసిన వెంటనే ఇండియా విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దేశం , రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎలా వుండాలి, ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి అనేదానిపై ప్రజంటేషన్ ఇచ్చారు. డెవలప్‌మెంట్, ఎడ్యుకేషన్ అనే విషయాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు.

విజన్ 2020 పేరుతో హల్‌చల్ :

ఇది చూసిన జనం అప్పటి విజన్ 2020తో బాబు ఏం చేశాడా అని ఒకసారి ఆలోచించుకుంటున్నారు. ప్రజలకు, సమాజానికి ఒరిగిందేమిటి ? వ్యవస్థలనుం ఎలా ముంచేశారు ? ఎలా అమ్మేశారు అనేది గుర్తుచేసుకుంటున్నారు. . ఆయన తనకు విజన్ ఉందని అంటారు.. చేసేవన్నీ వ్యవస్థలను ముంచేసే పనులు.. గుడ్డి నిర్ణయాలు అని భావిస్తున్నారు. మరి విజన్ 2020లో భాగంగా అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ఎలాంటి ఘనకార్యాలు చేశారో చూస్తే..

ప్రభుత్వ రంగ పరిశ్రమలను అమ్మేసిన చంద్రబాబు విజన్ :

పరిశ్రమల స్థాపన ద్వారా సంపద సృష్టించవచ్చని చెప్పే చంద్రబాబు తాను ఆ కంపెనీ తీసుకొచ్చా, ఈ కంపెనీ తెచ్చా అంటూ వుంటారు. ప్రైవేట్ సంగతి పక్కనబెడితే.. ఆయన హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలు తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. ఏకంగా 54 ప్రభుత్వ సంస్థలను చంద్రబాబు ప్రైవేట్ పరం చేశారు. నష్టాల్లో వున్న వాటి వల్ల ప్రభుత్వానికి ఒరిగేదేం లేదని తన అనుకూల మీడియాలో ప్రచారం చేయించి.. జనం దానిని నిజమని నమ్మేలా చేసి పని పూర్తి చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. చివరికి జనం కూడా చంద్రబాబు వల్ల రాష్ట్రానికి భారం తప్పింది అనేలా ఆయన వ్యూహాలు వుండేవి. అలా 54 ప్రభుత్వ రంగ సంస్థలను పావలాకు, అర్ధ రూపాయికి తన అనుచరులు, బినామీలు, కావాల్సిన వారికి అప్పగించారు.

విద్యుత్ ఛార్జీలు తగ్గించమన్నందుకు .. కాల్చి చంపి :

చంద్రబాబు హయాంలో తీరని మచ్చగా నేటికి చెప్పుకునే అంశం విద్యుత్ ఛార్జీలు. అప్పట్లో ఆర్ధిక సంస్కరణలని, విద్యుత్ సంస్కరణలని ఏదో చేద్దామని భావించారు బాబు గారు. అప్పు కోసం ప్రపంచ బ్యాంక్ ఆడమన్నట్లు ఆడిన ఆయన ప్రజలపై భారం మోపారు. దీనిలో భాగంగానే కరెంట్ ఛార్జీలు భారీగా పెంచారు. అప్పట్లో కరువు కాటకాల కారణంగా రాష్ట్రంలో పంటలు సరిగా పండేవి కావు.. దీనికి తోడు ఎప్పుడొస్తుందో తెలియని కరెంట్ రైతును నట్టేట ముంచేవి. ఈ పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలు హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో ఆందోళన నిర్వహించారు. ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తడంతో పోలీసులు లాఠీఛార్జ్, చివరికి కాల్పులు జరపాల్సి వచ్చింది. పోలీస్ తూటాలకు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బషీర్ భాగ్ విద్యుత్ ఉద్యమ కాల్పులు పేరిట చరిత్రలో బలంగా నిలిచిపోయింది.

ఔట్ సోర్సింగ్ విధానంతో నిరుద్యోగుల పొట్ట కొట్టిన బాబు :

ప్రభుత్వ ఉద్యోగ విధానంలోనూ చంద్రబాబు ప్రయోగాలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు అంతంత వేతనాలు ఎందుకివ్వాలంటూ తన హయాంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విధానాన్ని తీసుకొచ్చారు. అన్ని శాఖల్లోనూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించి రెగ్యులర్ ఉద్యోగి కంటే తక్కువ జీతంతో పనులు చేయించారు. వీరి వేతనాలు చివరి వరకు పెరగక ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డెక్కె పరిస్థితి నెలకొంది. ఈ విధానం వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గినా.. పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వీర్యమైపోయింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే నిరుద్యోగుల కలలు కల్లలయ్యాయి.

ప్రభుత్వాసుపత్రుల్లో యూజర్ ఛార్జీలు బాబుగారి ఘనతే :

నిరుపేదలకు వైద్య సదుపాయం అందాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వాలు ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మించాయి. అయితే చంద్రబాబు ఉచిత సేవ ఎందుకు..? ఎంతో కొంత యూజర్ ఛార్జీలు వసూలు చేస్తే మంచిది కదా అనే ఉద్దేశంతో స్వల్ప రుసుమును వసూలు చేసే విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టారు. దీంతో ఉచిత సేవ కాస్త పెయిడ్ సర్వీస్‌గా మారిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతం అమల్లో వున్న యూజర్ ఛార్జీలకు ఆద్యుడు చంద్రబాబే.

కమ్యూనిస్టులకు మంట :

చంద్రబాబుతో ఇప్పుడు రాసుకుపూసుకు తిరుగుతున్న కమ్యూనిస్ట్ పార్టీ నేతలకు ఒకప్పుడు ఆయనంటే మంట. పెత్తందార్లకు, పెట్టుబడిదార్లకు కొమ్ముకాస్తున్నారంటూ బాబుపై నిత్యం కాలు దువ్వేవారు కామ్రేడ్లు. ప్రపంచ బ్యాంక్ చేతిలో కీలు బొమ్మలా మారి రాష్ట్ర ప్రజలపై భారం మోపుతున్నారంటూ మండిపడేవారు. అయన అవినీతిని కప్పి పుచ్చలేక బాబు జమానా అవినీతి ఖజానా అంటూ పెద్ద పుస్తకమే రాశారు. ఇందులో బాబు పాలన ఎంత డొల్ల అనేదాన్ని స్పష్టంగా వివరించారు.

విద్యను పేదలకు దూరం చేసిన చంద్రబాబు :

రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సంస్కరించానని చెప్పుకునే చంద్రబాబు హయాంలోనే విద్య ఖరీదైనదిగా మారింది. ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యాలయాలను ఆయన పట్టించుకోలేదు. దీంతో స్కూళ్లలో మౌలిక వసతులు వుండేవి కావు, అడ్మిషన్లు తగ్గిపోయాయి. తప్పనిసరి పరిస్ధితుల్లో పేద, మధ్య తరగతి ప్రజలు అప్పు చేసి మరి తమ పిల్లలను కార్పోరేట్ స్కూళ్లు, కాలేజీలకు పంపారు. విద్య ప్రభుత్వ బాధ్యత కాదన్న తన భావాలను స్వయంగా మనసులోని మాట పుస్తకంలో ప్రస్తావించారు. ఆయన పాలనను, పనితీరును గమనించిన స్విట్జర్లాండ్ ఆర్ధిక మంత్రి పాస్కల్ ఓ సదస్సులో మాట్లాడుతూ.. ఇలాంటి వ్యక్తులను తమ దేశంలో అయితే జైల్లో కానీ, పిచ్చాసుపత్రిలో కానీ చేర్చేవాళ్లమని చెప్పారంటే చంద్రబాబు జమానా ఎలా వుండేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

విజన్ పేరుతో అమరావతి భూముల్లో రియల్ దందా :

గొప్ప విజనరీగా చెప్పుకున్న చంద్రబాబు.. రాష్ట్ర విభజన తర్వాత తమను ఏదో ఉద్ధరిస్తాడని భావించి అధికారం కట్టబెట్టారు. అప్పటికే అప్పులు, పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆంధ్రకు భారీ రాజధానిని సంకల్పించారు. ఇందుకోసం లక్షల కోట్ల ఖర్చు ఎందుకు? ఇప్పటీకే అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన విశాఖ ఉందిగా. రోడ్లు, రైలు , విమాన మార్గాలు ఉన్ ఈ నగరంలోనే కొన్ని భవనాలు కడితే అదే రాజధాని అయ్యేదన్న కనీస స్పృహ లేదు. ఇదంతా పక్కనబెట్టి లక్షల కోట్ల ఖర్చుతో , మూడు పంటలు పండే పచ్చని భూములను సేకరించి దాన్ని రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చారు.. ఇదేనా విజన్ ?

ఎవరిది విజన్ :

రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన అత్యంత పొడవైన తీరరేఖ ఉంది. అక్కడ పరిశ్రమలు... సముద్ర ఆధార వ్యవస్థలు ఏర్పాటు చేస్తే యువతకు ఎన్నో ఉద్యోగాలు , రాష్ట్రానికి రెవెన్యూ వస్తుంది. మరి విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు తన హయాంలో ఒక్క పోర్ట్ అయినా కట్టారా ? ఎలాంటి అనుభవం లేకపోయినా జగన్ ఎన్ని పోర్టులు కడుతున్నారు.. ఎన్ని ఫిషింగ్ హార్బర్లు కడుతున్నారు.. మరి ఏది విజన్, ఎవరిది విజన్. చంద్రబాబుకు నిజంగా ప్రజల మీద ఎలాంటి ప్రేమ, బాధ్యత లేదు.. ఎంతసేపూ తన అనుచరులు, అనుయాయుల లబ్ది, వారికి దోచిపెట్టడమే ఆయన విజన్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment