బిలాల్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఏం జరిగింది?
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పటి వరకు పోలీస్‌నేపథ్యంలో ఎన్నో సినిమాలు చూసి వుంటారు. కానీ ఇలాంటి పోలీస్‌ఆఫీసర్‌ను, ఇలాంటి కథను మీరు మాత్రం ఖచ్చితంగా చూసి వుండరు. పోలీస్‌నేపథ్యంలో జరిగే కథ ఇలాగే వుండాలి అని అందరూ అనుకుంటున్న ఫార్ములాను మా చిత్రం బ్రేక్ చేస్తుంది. అంటున్నారు నిర్మాత మహంకాళి శ్రీనివాసులు. ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై naga sai makam ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆయన నిర్మిస్తున్న చిత్రం బిలాల్‌పూర్ పోలీస్‌స్టేషన్.
జగ్గిలొల్లి అనేది ఉపశీర్షిక. శ్రీనాథ్ మాగంటి, మేఘన హీరో, హీరోయిన్లు. తొంభైశాతం షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం విశేషాలను నిర్మాత తెలియజేస్తూ ఇదొక వినూత్నమైన ప్రయత్నం.ఎంటర్‌టైనింగ్‌గా వుంటూనే అందరికి థ్రిల్ల్‌ను కలిగించే చిత్రమిది. తప్పకుండా చిత్రం అన్ని వర్గాలను అలరించే విధంగా వుంటుంది. నా తొలిప్రయత్నంగా పూర్తి సంతృప్తినిచ్చే చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఆనందంగా వుంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ యదార్థ సంఘటనల స్ఫూర్తితో అల్లుకున్న కథ ఇది.
పూర్తి సహజమైన కథ, కథనాలతో మనసుకు హత్తుకునే విధంగా వుంటుంది. బిలాల్‌పూర్ పోలీస్‌స్టేషన్ చుట్టు తిరిగే ఈ కథలో వినోదం, ప్రేమ, సెంటిమెంట్, థ్రిల్లింగ్, యాక్షన్ ఇలా అన్ని అంశాలు సమపాళ్లలో వుంటాయి అని తెలిపారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరిక్తొత అనుభూతిని పంచుతుంది అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: తోట.వి.రమణ, ఎడిటర్: ఉద్దవ్ ఎస్‌బి, సంగీతం: సాబూ వర్గీస్, పాటలు: సుద్దాల అశోక్‌తేజ, మౌన శ్రీ మల్లిక్, నీలా నర్సింహా, రామాంజానేయులు, నిర్మాత: మహంకాళి శ్రీనివాసులు, దర్శకత్వం: naga sai makam
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com