బాహుబ‌లి ప్రారంభాని కంటే ముందు ఏం జ‌రిగింది..?

  • IndiaGlitz, [Friday,January 20 2017]

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన తెలుగు సినిమా బాహుబ‌లి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతటి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఇక బాహుబ‌లి 2 చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే...జ‌య‌పూర్ లో జ‌రిగిన సాహిత్య వేడుక‌కు రాజ‌మౌళి, రానా హాజ‌ర‌య్యారు. ప్ర‌ముఖ ర‌చ‌యిత నీల‌కంఠ‌న్ ర‌చించిన ది రైజ్ ఆఫ్ శివ‌గామి పుస్త‌కం క‌వ‌ర్ పేజీని ఆవిష్క‌రించారు. బాహుబ‌లిలో ముఖ్య‌పాత్ర పోషించి శివ‌గామి పాత్ర ఆధారంగా ఈ పుస్త‌కం రాసారు.

అస‌లు..బాహుబ‌లి ప్రారంభానికి ముందు ఏం జ‌రిగింది అనే విష‌యాలను ఈ పుస్త‌కంలో రాసార‌ని స‌మాచారం. ఈ పుస్త‌కం ఆవిష్క‌రణోత్స‌వంలో పాల్గొన్న రాజ‌మౌళి ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ...ఈ వేడుక‌కు చాలా త‌క్కువ మంది వ‌స్తార‌ని అనుకున్నాను కానీ...అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది అన్నారు. అంతే కాకుండా ఈ పుస్త‌కం క‌వ‌రేజ్ తో పాటు ఈ ఫంక్ష‌న్ కు హాజ‌రైన జ‌నంతో తీసుకున్న సెల్ఫీని కూడా పోస్ట్ చేసారు రాజ‌మౌళి. ఈ పుస్త‌కం మార్చి 7 నుంచి మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది.

More News