నా సినిమాని గొప్ప సినిమాతో పొల్చడం అంటే అంతకంటే ఏం కావాలి - డైరెక్టర్ పరుశురామ్
Send us your feedback to audioarticles@vaarta.com
యువత, ఆంజనేయులు, సోలో, సారొచ్చారు...ఇలా వైవిధ్యమైన కథా చిత్రాలను అందించిన డైరెక్టర్ పరుశురామ్ తాజా చిత్రం శ్రీరస్తు - శుభమస్తు. ఈ చిత్రంలో అల్లు శిరీష్ -లావణ్య జంటగా నటించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన శ్రీరస్తు శుభమస్తు చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 5న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా శ్రీరస్తు శుభమస్తు డైరెక్టర్ పరుశురామ్ తో ఇంటర్ వ్యూ మీకోసం..
శ్రీరస్తు - శుభమస్తు కథ ఏమిటి..?
ఆత్మాభిమానంకు - అహంకారంకు మధ్య చిన్న గీత ఉంటుంది. దీనిని గురించి ఈ చిత్రంలో డిష్కస్ చేసాను. అలాగే ఇంతకు ముందు మన తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి మన గురించి ఎవరు చెడుగా మాట్లాడుకోకూడదు అనుకునేవారు. కానీ..ఇప్పుడు అలా లేదు. మన గురించి ఎవరు ఎలా మాట్లాడుకుంటే నాకేంటి అనే ధోరణి పెరిగింది. ఈ పాయింట్ ఆధారంగా తెరకెక్కించాను.
శిరీష్ ని ఈ క్యారెక్టర్ కోసం ఎలా మార్చారు..?
శిరీష్ ని నేను ఏమీ మార్చలేదు. ఈ క్యారెక్టర్ కోసం తనని తాను శిరీషే మార్చుకున్నాడు. నాకు ఏం కావాలనేది ఏక్ట్ చేసి చూపిస్తాను. ఆవిధంగా శిరీష్ ని నేను ఎలా చూపించాలనుకున్నానో అలా చేసాడు. సినిమా చూస్తుంటే మన పక్కంటి అబ్బాయిని చూస్తున్నామా అనిపిస్తుంది.
ప్రకాష్ రాజ్, రావు రమేష్, సుమలత ఇలా...సీనియర్ ఆర్టిస్టులు ఎక్కువుగా కనిపిస్తున్నారు కావాలనే పెట్టారా..?
ఈ చిత్రంలో ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అంతే కానీ..ఏదో కావాలని సీనియర్ ఏక్టర్స్ ని పెట్టలేదు. సినిమా చూసిన తర్వాతే అందరికీ తెలుస్తుంది.
సోలో సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ సాఫ్ట్ గా ఉంటుంది కదా...మరి ఇందులో సాఫ్ట్ గా కాకుండా కాస్త డిఫరెంట్ గా చూపించారు కారణం..?
ఇందులో కూడా హీరోయిన్ క్యారెక్టర్ సాఫ్ట్ గా ఉంటుంది. కాకపోతే అల్లరి ఎక్కువ చేస్తుంటుంది. ఇక లావణ్య గురించి చెప్పాలంటే...అను అనే పాత్రలో అద్భుతంగా నటించింది.
శిరీష్ పర్ ఫార్మెన్స్ గురించి ఏం చెబుతారు..?
ఈ సినిమాకి సర్ ఫ్రైజ్ ఎలిమెంట్ అంటే శిరీషే. గంగోత్రి సినిమా నుంచి ఆర్య సినిమాకి బన్ని ఎలా అయితే ఏక్టింగ్ లో కొత్తదనం చూపించాడో...శిరీష్ కూడా అంతే...కొత్తజంట నుంచి శ్రీరస్తు శుభమస్తు వరకు ఓ కొత్త శిరీష్ ని చూస్తారు.
చిరంజీవి గారు పరుశురామ్ ముత్యాల్లాంటి డైలాగ్స్ రాసాడు అని అభినందించారు కదా ఎలా ఫీలయ్యారు..?
చిరంజీవి గారు ఈ సినిమా చూసి బాగుంది అని చెప్పడంతో పాటు ముఖ్యంగా డైలాగ్స్ బాగున్నాయి చెప్పడం ఎంత ఆనందపడ్డానో మాటల్లో చెప్పలేను. ఆరోజు నా లైఫ్ లో మరచిపోలేని రోజు. ఈ సినిమా డైలాగ్స్ విషయానికి వస్తే...నేనేదో కావాలి అని డైలాగ్స్ బాగుండాలి అని రాయలేదు. సందర్భానుసారంగా డైలాగ్స్ రాసాను అంతే..!
చిరంజీవి గారు ఈ సినిమా చూసి బొమ్మరిల్లు గుర్తుకువచ్చింది అన్నారు. ఆ సినిమాతో ఈ సినిమాకి పోలికలు ఏమైనా ఉన్నాయా..?
చిరంజీవి గారు శ్రీరస్తు శుభమస్తు చూసి బొమ్మరిల్లు గుర్తుకువచ్చింది అనడం చాలా హ్యాపీగా ఫీలయ్యాను. నా సినిమాని గొప్ప సినిమాతో పొల్చడం అంటే అంతకంటే ఇంకేం కావాలి... అయితే...ఆ సినిమాకి ఈ సినిమాకి పోలికలు ఉండవు.
బన్ని ఈ సినిమా చూసి కరెక్షన్స్ చెప్పారట కదా..?
బన్ని కి ముందు కథ తెలుసు. డబల్ పాజిటివ్ చూసి అసలు ఈ సినిమా ఇలా ఉంటుందని అసలు ఊహించలేదు అని చెప్పాడు. చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పాడు అంతే..!.
బిగ్ బ్యానర్ గీతా ఆర్ట్స్ లో వర్క్ చేయడం ఎలా అనిపించింది..?
గతంలో బిగ్ బ్యానర్స్ వైజయంతీ మూవీస్, పరమేశ్వరీ ఆర్ట్స్ బ్యానర్స్ లో కూడా వర్క్ చేసాను. కాకపోతే ఇక్కడ వర్క్ చేయడం వలన ప్లస్ ఏమిటంటే...మంచి టీమ్ ఉంది. ప్రతిదీ డిస్కష్ చేసి చేస్తుంటారు. అలా చేయడం డైరెక్టర్ కి ప్లస్. నాకు ఈ బ్యానర్ లో వర్క్ చేయడం చాలా కంఫర్ట్ గా అనిపించింది.
సారొచ్చారు తర్వాత గ్యాప్ రావడానికి కారణం ఏమిటి..?
సారొచ్చారు తర్వాత గీతా ఆర్ట్స్ లో సినిమా చేద్దామని ఓ స్ర్కిప్ట్ రెడీ చేసాను. గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి స్ర్కిప్ట్ వర్క్ కి వెళుతున్న టైమ్ లో శిరీష్ తో పరిచయం ఏర్పడింది. ఓరోజు శిరీష్ మీరు తీసిన సోలో సినిమా బాగా ఇష్టం అని చెప్పాడు. ఆతర్వాత బన్ని వాసు, అల్లు అరవింద్ గారు ఫోన్ చేసి శిరీష్ నీతో సినిమా చేయాలనుకుంటున్నాడు చేస్తావా అని అడిగారు. నేను ఎలా కాదనగలను ఓకే చెప్పాను. ఆతర్వాత ఏడు నెలలకు ఈ స్ర్కిప్ట్ రెడీ చేసాను. ముందు వేరే హీరో కోసం ఓ స్ర్కిప్ట్ రెడీ చేసాను. ఆతర్వాత ఏడు నెలలు వర్క్ చేసి శిరీష్ కోసం స్ర్కిప్ట్ రెడీ చేసాను. అందువలన ఈ గ్యాప్ వచ్చింది.
క్రిష్ మీరు కథ రాస్తే ఆయన డైరెక్ట్ చేస్తానను అన్నారు కదా..క్రిష్ కోసం కథ ఎప్పుడు రాస్తున్నారు..?
క్రిష్ నా మీద అభిమానంతో అలా అన్నాడు. క్రిష్ ఫస్ట్ ఫిల్మ్ గమ్యం, నా ఫస్ట్ ఫిల్మ్ యువత ఇంచు మించు ఒకేసారి రిలీజ్ అయ్యాయి. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. కంచె సినిమా చూసి నాకు ఇలాంటి ఆలోచన ఎందుకు రాలేదా అనిపించింది. నాకు బాగా నచ్చిన చిత్రాల్లో కంచె ఒకటి.
మీ గురువు పూరి జగన్నాథ్ గురించి ఏం చెబుతారు..?
నాకు తల్లిదండ్రుల తర్వాత అన్నీ ఆయనే. ఒక మాటలో చెప్పాలంటే...నా దేవుడు. ఈరోజు ఇలా ఉన్నాను అంటే దానికి కారణం ఆయనే.
తదుపరి చిత్రం వివరాలు..?
నా తదుపరి చిత్రం కూడా గీతా ఆర్ట్స్ లోనే ఉంటుంది. కథ రెడీగానే ఉంది. నటీనటులు ఎవరనేది త్వరలో తెలుస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments