ఎంత పని చేశావ్ సమంత...
Send us your feedback to audioarticles@vaarta.com
చెన్నై సొగసరి సమంత మంచి నటి అనే విషయం కొత్తగా చెప్పక్కర్లేదు. తొలి చిత్రం ఏమాయ చేసావెతోనే తనలోని ప్రతిభని చూపించింది ఆమె. ఆ తరువాత ఈగ, ఎటో వెళ్లిపోయింది, మనం చిత్రాలలో తన మార్క్‌ని చాటుకుంది . ప్రస్తుతం సమంత `రాజు గారి గది 2` సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కూడా నటనకి స్కోప్ ఉన్న పాత్రలో కనిపించనుంది సమంత. ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. `మనం` తరువాత నాగార్జునతో కలిసి ఈ చిత్రంలో నటిస్తోంది సమంత. ఈ చిత్రం ట్రైలర్స్ లో సమంత లుక్ సినిమాపై మరింత ఇంట్రస్ట్‌ని పెంచింది.
ఇదిలా ఉంటే.. సమంతకి రెగ్యులర్ గా డబ్బింగ్ చెప్పే సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి.. ఈ సినిమాకి కూడా డబ్బింగ్ చెప్పింది. అయితే, డబ్బింగ్ చెపుతూ చెపుతూ చివరికి ఏడ్చేసిందట. అంత హార్ట్ టచింగ్ క్యారెక్టర్‌లో సమంత కనిపించిందని ఆమె తెలిపింది. రాజు గారి గది2 వచ్చే నెల 13న విడుదల కానుంది. ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి థమన్ సంగీతమందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com