'ఆచార్య' షూటింగ్లో సోనూసూద్‌తో చిరు ఏమన్నారంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం 'ఆచార్య'. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో విలన్‌గా సోనూసూద్ నటిస్తున్నారు. రీసెంట్ ఇంటర్వ్యూలో సోనూసూద్ ఆచార్య సినిమా గురించి.. చిరంజీవితో చేసిన సంభాషణ గురించి చెప్పారు. "నేను ఇకపై విలన్‌గా చేయను. ప్రేక్షకులు నన్ను అలా చూడాలని అనుకోవడం లేదు. హీరోగా చేయమని అడుగుతున్నారు. ఇప్పటికే నాలుగు స్క్రిప్ట్స్ సిద్ధంగా ఉన్నాయి. ఆచార్య సినిమా షూటింగ్లో చిరు సర్.. నన్ను కొట్టడానికి ఇబ్బంది పడ్డారు. కోవిడ్ సమయంలో ఎంతో మందికి సాయం చేసి వారి హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నావు. నిన్ను కొడితే ప్రేక్షకులు నన్ను తప్పుగా అనుకుంటారేమోనని అన్నారు. సినిమాలో ఓ సన్నివేశంలో నాపై చిరంజీవి కాలు పెట్టే సన్నివేశం ఉంది. దాన్ని రీషూట్ కూడా చేశారు" అన్నారు.
కోవిడ్ లాక్డౌన్ తర్వాత ప్రారంభమైన 'ఆచార్య' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో రామ్‌చరణ్ నక్సలైట్ నాయకుడిగా కీలక పాత్రలోనటిస్తుంటే, చిరంజీవి మాజీ నక్సలైట్ పాత్రలో కనిపించనున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవాదాయ శాఖలోని అవినీతి ప్రశ్నిస్తూ తనదైన శైలిలో మెసేజ్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్‌ను యాడ్ చేసి దర్శకుడు కొరటాల శివ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments