ఈసారి మాటీవీ అవార్డ్స్ ఫంక్షన్ లో సుమ - ఆలీ ఏం చేయబోతున్నారు
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమా ప్రపంచంలో ఏ విభాగంలో ఉన్నా...ప్రతిభ ఒక్కటే కొలమానంగా అవార్డులు అందిస్తూ నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంతగానో ప్రొత్సహిస్తున్న ఛానల్ మాటీవీ. ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా అవార్డుల పండుగకు రంగం సిద్దమైంది. కొన్ని నెలల క్రితం స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (స్టార్ టీవీ) లో భాగమైన మా ఛానల్ నెట్ వర్క్ ఈ సంవత్సరం అవార్డుల ఉత్సవాన్ని మరింత ఉన్నత స్ధాయిలో ప్రేక్షకులకు అందించబోతుంది. అత్యున్నత స్ధాయి నాణ్యతను పెంచుకుంటూ వెళుతున్న సినిమా అవార్డుల పండుగ ఈ సంవత్సరం ఇంతకు ముందు జరగని, ఊహించని, అద్భుతమైన స్ధాయిలో జరగబోతుంది. ప్రేక్షకుల్ని ఒక సరికొత్త లోకంలో విహరింపచేసే స్టార్స్ అవార్డులు తీసుకుంటూ వేదిక పైన కూడా వివిధ రకాల ప్రదర్శనల్లో పాల్గొని ప్రేక్షకులకు అద్భుతమైన వినోదాన్ని అందించడానికి సర్వం సిద్దమైంది. ఈనెల 12వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఆరంభం అయ్యే ఈవెంట్ కలకాలం గుర్తుండిపోయేలా జరగబోతుంది.
అసలు మాటీవీ అవార్డ్స్ పంక్షన్ వస్తుంది అంటే...ఈ సంవత్సరం అవార్డ్స్ ఎవరెవరికి వస్తాయి అనే ఆసక్తితో పాటు ఈసారి సుమ, ఆలీ కలిసి ఏ సినిమా స్పూఫ్ చేయబోతున్నారు..ఎలాంటి గెటప్స్ లో కనిపించనున్నారని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. మాటీవీ అవార్డ్స్ వేడుకల్లో ఇప్పటి వరకు ఆలీ, సుమ ఎలాంటి గెటప్స్ తో దర్శనమిచ్చారో చూస్తే.... 2010 సినిమా అవార్డ్స్ ఫంక్షన్ లో సుమ, ఆలీ మాయబజార్ సినిమాలో అక్కినేని, సావిత్రి గెటప్ లో దర్శనమిచ్చి ఆడియోన్స్ ని థ్రిల్ చేసారు. ఆతర్వాత 2011లో అరుంథతి గెటప్ లో సుమ, సోనుసూద్ గెటప్ లో ఆలీ కనిపించి కనువిందు చేసారు. 2012లో బిజినెస్ మేన్ సినిమాలో మహేష్, కాజల్ పాత్రల్లో కనిపించారు. 2013 జగదేవీవీరుడు అతిలోకసుందరిలో శ్రీదేవి గెటప్ లో సుమ, భాషా సినిమాలో రజనీకాంత్ గెటప్ లో ఆలీ, 2015 లో మా మ్యూజిక్ అవార్డ్స్ ఫంక్షన్ లో బాహుబలి లో తమన్నా, ప్రభాస్ గెటప్స్ లో సుమ, ఆలీ కనిపించి కడుపుబ్బా నవ్వించారు.
ఈసారి అవార్డ్స్ ఫంక్షన్ లో సుమ - ఆలీ ఏం చేయనున్నారు..? సోగ్గాడే చిన్ని నాయనా స్పూఫ్ చేయనున్నారా..? లేక ఊపిరి స్పూఫ్ చేయనున్నారా..? ఏ సినిమాని సెలెక్ట్ చేసుకోనున్నారు అనేది ఇంట్రస్టింగ్ గా & సస్పెన్స్ గా మారింది. ఈ సంవత్సరం మాటీవీ అవార్డ్స్ పండుగను కలకాలం గుర్తుండిపోయేలా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటి వరకు జరిగిన మాటీవీ అవార్డ్స్ పండుగలకు మించి ఈ సంవత్సరం వేడుక అద్భుతంగా జరగబోతుంది. మనందరికీ కావల్సినంత వినోదాన్ని అందిస్తుంది అని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments