శ్రీరెడ్డి పరిస్థితి ఏంటి ?
Send us your feedback to audioarticles@vaarta.com
`మీటూ` అంటూ ఎవరైనా అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చే పేరు తనుశ్రీ దత్తా. హాలీవుడ్లో చెలరేగిన మీటూ వివాదాన్ని బాలీవుడ్‌కి పాకించింది తనుశ్రీ దత్తానే. తనకు ఎదురైన వేదింపుల గురించి ఆమె తొలిసారి ఓ ఇంటర్వ్యూలో నోరు విప్పింది.
`హార్న్ ఓకే ప్లీజ్` సమయంలో డ్యాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్యతో కలిసి నానా పటేకర్ తనను సెక్సువల్ హెరేస్ చేశారని ఆమె పోలీసులో కంప్లయింట్ చేసింది. ఎన్నాళ్లుగానో ఈ వివాదం ఇలాగే ఉండగా, గురువారం ఈ విషయాన్ని పోలీసులు తేల్చేశారు. నానాపటేకర్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలు దొరకలేదని, ఆధారాలు లేకపోవడంతో ఈ కేసును క్లోజ్ చేస్తున్నామని ప్రకటించేశారు. దాంతో తనుశ్రీదత్తా ఫైర్ అయ్యారు. పోలీసు వ్యవస్థ, న్యాయవ్యవస్థ భ్రష్టు పట్టిపోయాయనీ, వాటి రెండింటిని మించి భ్రష్టుపట్టిన నానా పటేకర్‌ను అవి కాపాడాయని , ఇది శోచనీయమని ఆమె బాధను వ్యక్తం చేశారు.
ఆమె పరిస్థితే అలా ఉంటే, దక్షిణాదిన శ్రీరెడ్డి పరిస్థితి ఏంటి? ఈమె చేసిన ఆరోపణలు ఎప్పుడు కొలిక్కి వస్తాయి అని ఫిల్మ్ నగర్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com
Comments