పూరీ లెక్క ఏమౌతుందో మరి..
Send us your feedback to audioarticles@vaarta.com
పూరి జగన్నాథ్ తన తదుపరి సినిమా `పైసా వసూల్` సక్సెస్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు. కాన్ఫిడెంట్‌గా కూడా ఉన్నాడు. పూరి అంటే మాస్ ఇమేజ్‌ను పక్కాగా ఎలివేట్ చేసే దర్శకుడు. ఇప్పుడున్న యంగ్ టాప్ హీరోస్ అందరూ పూరి దర్శకత్వంలో మాస్ ఇమేజ్ సంపాదించుకున్నవారే. అయితే టెంపర్ తరువాత సరైన విజయం లేకపోయినప్పటికీ..
తన బ్రాండ్ ఇమేజ్ తో బాలకృష్ణతో సినిమా చేసే అవకాశాన్ని పొందాడు పూరీ జగన్నాథ్. అనుకున్న టైం కంటే ముందుగానే సినిమాని పూర్తిచేసి మరోసారి వార్తల్లో నిలిచాడు పూరీ. ఓ వైపు డ్రగ్స్ వివాదం ఆయనని ఇబ్బంది పెట్టినా.. వృత్తి పరంగా తనను తాను నిరూపించుకుంటూనే ఉండడం ఆయన స్పెషాలిటీ. ఇదిలా ఉంటే.. పైసా వసూల్ విజయంపై పూరీ పూర్తి నమ్మకంతో ఉన్నాడు. దానికి తోడు ఓ సెంటిమెంట్ తనకి ముచ్చటగా మూడోసారి కలిసొస్తుందని భావిస్తున్నాడట. అదేమిటంటే.. సెప్టెంబర్‌లో విడుదలైన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, చిరుత చిత్రాలు గతంలో తనకి మంచి విజయాలను అందించాయి. ఇదే బాటలో పైసా వసూల్ కూడా అదే నెలలో రాబోతుండడం సెంటిమెంట్‌గా ఫీలవుతున్నాడట. సెప్టెంబర్ 1న రానున్న పైసా వసూల్ పూరీ సెంటిమెంట్‌ని ఎంతమేరకు వర్కవుట్ చేస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com