SriDevi : పుస్తకంగా శ్రీదేవి జీవిత చరిత్ర.. ఇక రావాల్సింది బయోపిక్కే
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీదేవి.. ఈ పుట్టినరోజు పేరు తెలియనివారు భారతదేశంలో లేరు. అందాల నటిగా భారతీయ చిత్ర పరిశ్రమపై ఆమె వేసిన ముద్ర అసాధారణం. తెలుగు, తమిళ,కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించారు. లేడి సూపర్‌స్టార్‌గా అగ్రకథానాయకులకు సైతం పోటీనిచ్చారు. ఎంతోమంది మహిళలకు రోల్ మోడల్‌గా నిలిచి సినీరంగం వైపు వచ్చేలా స్పూర్తినిచ్చారు. పెళ్లి పిల్లల తర్వాత కొంతకాలం గ్యాప్ ఇచ్చినప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్‌లో మళ్లీ విజృంభించారు . కానీ ఎవ్వరూ ఊహించని విధంగా 2018 ఫిబ్రవరి 24న ఈ అతిలోక సుందరి దేవలోకానికి తరలివెళ్లిపోయారు.
శ్రీదేవి బయోపిక్ కోసం యత్నాలు:
ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ బయోపిక్‌ల సీజన్ నడుస్తూ వుండటంతో శ్రీదేవి జీవిత కథను కూడా వెండితెరపైకి ఆవిష్కరించాలని పలువురు ప్లాన్ చేస్తున్నారు. ఆమె చిన్న తనం నుంచి స్టార్ ఎదిగే క్రమంలో శ్రీదేవి జీవితంలో ఎన్నో మలుపులు. ఇక వివాహం విషయం ఎంతో వివాదాస్పదం. అలా ఒక సినిమాకు కావాల్సిన ముడి సరుకు ఆమె జీవితంలో ఎంతో వుంది. అందుకే ఫిల్మ్ మేకర్స్ శ్రీదేవి జీవితాన్ని వెండితెర మీద ఆవిష్కరించాలని చూస్తున్నారు.
ది లైఫ్ ఆఫ్ ఏ లెజెండ్ పేరుతో శ్రీదేవి బయోగ్రఫి:
అయితే ఈ ప్రయత్నాలు ఇంకా కార్యరూపం దాల్చకపోవడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఈ క్రమంలో శ్రీదేవి కుటుంబంతో అనుబంధం వున్న ప్రముఖ పరిశోధకుడు, రచయిత ధీరజ్ ఆమె బయోగ్రఫిని రచించారు. ‘‘ది లైఫ్ ఆఫ్ ఏ లెజెండ్’’ పేరుతో రాసిన ఈ పుస్తకం గురించిన వివరాలను శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్ మీడియాకు తెలియజేశారు. దీనిని ఈ ఏడాది చివరిలో వెస్ట్‌ల్యాండ్ బుక్ సంస్థ విడుదల చేయనుంది. ఇందులో శ్రీదేవి గురించిన వివరాలు, సినిమా సంగతులు పంచుకున్నారు. ఈ పుస్తకం ద్వారా ఆమె బయోపిక్ తెరకెక్కే అవకాశం వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com