థియేటర్లలో 100% ఆక్యూపెన్సీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన వెస్ట్ బెంగాల్ సీఎం

  • IndiaGlitz, [Saturday,January 09 2021]

సంక్రాంతి అంటే కోనసీమకే కాదు.. సినీ ఇండస్ట్రీకి వెలుగు తెస్తుంది. ఈ పండుగకు విడుదల చేయాలని ప్రతి సినిమాకు సంబంధించిన చిత్రబృందం భావిస్తూ ఉంటుందనడంలో అతిశయోక్తి కాదు. సంక్రాంతి సమయంలో వచ్చినన్ని కలెక్షన్లు.. మరే సీజన్‌లోనూ రావు. అయితే కరోనా మహమ్మారి కారణంగా చిత్ర పరిశ్రమ బాగా నష్టపోయింది. లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూతపడటం.. ఇటీవలి కాలంలో కేంద్రం థియేటర్లను తెరిచేందుకు పర్మిషన్ ఇచ్చినప్పటికీ 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన విధించడంతో నష్టాలు తప్ప లాభాలు ఉండవని నిర్మాతలు భావించారు. దీంతో సినిమాల విడుదలకు బ్రేక్ పడుతోంది.

వ్యాక్సిన్‌ త్వరలో రాబోతున్న తరుణంలో ఈ సంక్రాంతికి 100 శాతం ఆక్యూపెన్సీ కోరుతూ సినిమా ఇండస్ట్రీస్‌ నుంచి కేంద్రానికి విజ్ఞప్తులు వెళుతున్నాయి. అయినా కేంద్రం మాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదు. మరోవైపు తమిళనాడు రాష్ట్రంలో 100 శాతం ఆక్యూపెన్సీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కానీ ఒక రాష్ట్రంలో మాత్రం 100 శాతం ఆక్యూపెన్సీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తున్నట్లుగా ఆ రాష్ట్ర సీఎం అనుమతులు జారీ చేయడం విశేషం.

కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఈ తరుణంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మాత్రం డేరింగ్‌గా ఓ స్టెప్ తీసుకుంది‌. థియేటర్లను 100 శాతం సీటింగ్‌తో నడిపించుకోవచ్చంటూ ఆదేశాలు జారీ చేసింది. కోల్‌కత్తాలో శుక్రవారం జరిగిన 26వ కోల్‌కత్తా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మమతా బెనర్జీ ఈ సందర్భంగా థియేటర్ల యాజమాన్యాలకు ఈ వరాన్ని ఇచ్చారు. అయితే కరోనా ప్రోటోకాల్స్‌ మాత్రం తప్పనిసరిగా పాటించాలని ఆమె తెలిపారు. మరి మమత నిర్ణయంపై కేంద్రం ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.

More News

ఏపీలో పల్లె పోరుకు పిలుపు.. జరిగేనా.. నిలిచేనా?

ఆంధ్రప్రదేశ్ పల్లెపోరుకు సిద్ధమవుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ప్రకటించేశారు.

షాకింగ్.. 2021 మరీ భయానకంగా ఉంటుందట..

2020.. సమస్త ప్రజానీకం జీవితంలో కల్లోలం రేపింది. ప్రపంచాన్ని స్తంభింపజేసింది. అంతేనా ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టకుండా చేసింది.

ఆఖ‌రి షెడ్యూల్ లో  హిమాల‌య స్టూడియో మేన్ష‌న్స్  ప్రొడ‌క్ష‌న్ నెం-1 చిత్రం

హిమాల‌య స్టూడియో మేన్ష‌న్స్ ప‌తాకంపై రోన‌క్ కాటుకూరి, నేహా సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ ద‌ర్శ‌క‌త్వంలో పి.ఉద‌య్ కిర‌ణ్ నిర్మిస్తోన్న ప్రొడ‌క్ష‌న్  నెం-1 చిత్రం

మహేష్‌కి వదినగా నటిస్తున్నారనే వార్తపై రేణు దేశాయ్ క్లారిటీ..

ప్రముఖ నటి రేణూ దేశాయ్.. బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా బిజీ అవుతూ వస్తున్నారు. ఇటీవలే ఆమె వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు

దేశంలో విజృంభిస్తున్న బర్డ్‌ఫ్లూ.. తెలుగు రాష్ట్రాల పరిస్థితేంటంటే..

దేశంలో బర్డ్‌ఫ్లూ వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో ఈ వైరస్ ప్రతాపాన్ని చూపిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది.