థియేటర్లలో 100% ఆక్యూపెన్సీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన వెస్ట్ బెంగాల్ సీఎం
Send us your feedback to audioarticles@vaarta.com
సంక్రాంతి అంటే కోనసీమకే కాదు.. సినీ ఇండస్ట్రీకి వెలుగు తెస్తుంది. ఈ పండుగకు విడుదల చేయాలని ప్రతి సినిమాకు సంబంధించిన చిత్రబృందం భావిస్తూ ఉంటుందనడంలో అతిశయోక్తి కాదు. సంక్రాంతి సమయంలో వచ్చినన్ని కలెక్షన్లు.. మరే సీజన్లోనూ రావు. అయితే కరోనా మహమ్మారి కారణంగా చిత్ర పరిశ్రమ బాగా నష్టపోయింది. లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటం.. ఇటీవలి కాలంలో కేంద్రం థియేటర్లను తెరిచేందుకు పర్మిషన్ ఇచ్చినప్పటికీ 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన విధించడంతో నష్టాలు తప్ప లాభాలు ఉండవని నిర్మాతలు భావించారు. దీంతో సినిమాల విడుదలకు బ్రేక్ పడుతోంది.
వ్యాక్సిన్ త్వరలో రాబోతున్న తరుణంలో ఈ సంక్రాంతికి 100 శాతం ఆక్యూపెన్సీ కోరుతూ సినిమా ఇండస్ట్రీస్ నుంచి కేంద్రానికి విజ్ఞప్తులు వెళుతున్నాయి. అయినా కేంద్రం మాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదు. మరోవైపు తమిళనాడు రాష్ట్రంలో 100 శాతం ఆక్యూపెన్సీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కానీ ఒక రాష్ట్రంలో మాత్రం 100 శాతం ఆక్యూపెన్సీకి గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నట్లుగా ఆ రాష్ట్ర సీఎం అనుమతులు జారీ చేయడం విశేషం.
కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఈ తరుణంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మాత్రం డేరింగ్‌గా ఓ స్టెప్ తీసుకుంది. థియేటర్లను 100 శాతం సీటింగ్‌తో నడిపించుకోవచ్చంటూ ఆదేశాలు జారీ చేసింది. కోల్‌కత్తాలో శుక్రవారం జరిగిన 26వ కోల్కత్తా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మమతా బెనర్జీ ఈ సందర్భంగా థియేటర్ల యాజమాన్యాలకు ఈ వరాన్ని ఇచ్చారు. అయితే కరోనా ప్రోటోకాల్స్ మాత్రం తప్పనిసరిగా పాటించాలని ఆమె తెలిపారు. మరి మమత నిర్ణయంపై కేంద్రం ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments