ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
అలనాటి ప్రముఖ మ్యూజిక్ డైరక్టర్ల జంట రాజన్-నాగేంద్రలో తమ్ముడు రాజన్ (87) సోమవారం బెంగళూరులో కన్నుమూశారు. తన అన్న నాగేంద్రతో కలిసి రాజన్ 450 చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. కన్నడలో 350 చిత్రాలకు సంగీతం అందించగా.. తెలుగులో 60, తమిళంలో నాలుగు చిత్రాలకు సంగీతం అందించారు. కాగా.. అన్న నాగేంద్ర 2000 నవంబరులో కన్నుమూయగా.. రాజన్ నేడు మృతి చెందారు. ఆనాటి సంగీతకారుల్లో ఈ జంట అతి మధురమైన పాటలు అందించింది
తెలుగులో పంతులమ్మ, ఇంటింటి రామాయణం, సొమ్మొకడిది సోకొకడిది, మంచుపల్లకీ, నాలుగుస్తంభాలాట, ప్రేమఖైది తదితర చిత్రాలకు రాజన్-నాగేంద్ర సంగీతం అందించారు. రాజన్ 1933లో జన్మించగా.. నాగేంద్ర 1935లో జన్మించారు. మైసూరులోని శివరాంపేటలో ఓ మధ్యతరగతి సంగీత నేపథ్యమున్న కుటుంబంలో ఈ అన్నదమ్ములిద్దరూ జన్మించారు. వీరి తండ్రి రాజప్ప ఫ్లూటు, హార్మోనియం వాయించేవారు. పలు సినిమాలకు రాజప్ప బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout