ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మృతి

  • IndiaGlitz, [Monday,October 12 2020]

అలనాటి ప్రముఖ మ్యూజిక్ డైరక్టర్ల జంట రాజన్-నాగేంద్ర‌లో తమ్ముడు రాజన్ (87) సోమవారం బెంగళూరులో కన్నుమూశారు. తన అన్న నాగేంద్రతో కలిసి రాజన్ 450 చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. కన్నడలో 350 చిత్రాలకు సంగీతం అందించగా.. తెలుగులో 60, తమిళంలో నాలుగు చిత్రాలకు సంగీతం అందించారు. కాగా.. అన్న నాగేంద్ర 2000 నవంబరులో కన్నుమూయగా.. రాజన్ నేడు మృతి చెందారు. ఆనాటి సంగీతకారుల్లో ఈ జంట అతి మధురమైన పాటలు అందించింది

తెలుగులో పంతులమ్మ, ఇంటింటి రామాయణం, సొమ్మొకడిది సోకొకడిది, మంచుపల్లకీ, నాలుగుస్తంభాలాట, ప్రేమఖైది తదితర చిత్రాలకు రాజన్‌-నాగేంద్ర సంగీతం అందించారు. రాజన్ 1933లో జన్మించగా.. నాగేంద్ర 1935లో జన్మించారు. మైసూరులోని శివరాంపేటలో ఓ మధ్యతరగతి సంగీత నేపథ్యమున్న కుటుంబంలో ఈ అన్నదమ్ములిద్దరూ జన్మించారు. వీరి తండ్రి రాజప్ప ఫ్లూటు, హార్మోనియం వాయించేవారు. పలు సినిమాలకు రాజప్ప బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారు.

More News

సుజాత హౌస్ నుంచి అవుట్.. రివెంజ్ తీర్చుకున్న స్టాఫ్..

సండే.. ఫన్‌డే.. రివెంజ్‌లతో పాటు ఎలిమినేషన్.. అంతా మంచి జోష్‌తో నడిచింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సాంగ్‌తో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీకి ఖుష్బూ రాజీనామా.. మధ్యాహ్నం బీజేపీలో చేరిక..

తమిళనాడుకు చెందిన ప్రముఖ సినీనటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఖుష్బూ సోమవారం ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత ఘన విజయం

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది.

‘ఆదిపురుష్’లో అజయ్ దేవగణ్ పాత్రపై క్లారిటి..!

ఆదికావ్యం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నారు.

‘మహాసముద్రం’లో మధ్య తరగతి అమ్మాయిగా అదితి..

‘సమ్మోహనం’తో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అదితిరావు హైదరీ మరో తెలుగు సినిమాలో కనిపించనుంది.