జారిన ప్యాంటు.. ఆగిన పెళ్లి..

  • IndiaGlitz, [Sunday,November 08 2020]

పెళ్లికి బంధువులనందరినీ పిలుచుకున్నారు. వైభవంగా ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. వధువు మెడలో పూల మాల వేసే సమయంలో డామిట్ కథ అడ్డం తిరిగింది. వధువు మెడలో పూలమాల వేసే సమయంలో వరుడి ప్యాంటు జారింది.. పరువు గంగలో కలిసింది. ఒకసారి జారితే ఓకే పదే పదే జారితే ఎలా ఉంటుంది? చూసేవారికి ఫన్నీగా అనిపించినప్పటికీ పెళ్లికూతురు కుటుంబ సభ్యులకు మాత్రం బీభత్సంగా కోపం తెప్పించింది. బాగా ఇరిటేట్ అయ్యారు.

వేదికపైకి వచ్చి పెళ్లికొడుకుతో వాగ్వాదానికి దిగారు. కొట్టినంత పని చేశారు. ప్యాంటు జారిపోతే తప్పు నాదా? అని పెళ్లికొడుకు.. ప్యాంటునే సరిగ్గా కట్టుకోలేని వాడివి.. పెళ్ళాంను ఏం చూసుకుంటావు? అని పెళ్లి కూతురి తరుఫు బంధువులు.. చివరకు పెళ్లిని ఆపేసి పెళ్లికూతురును బంధువులు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.