సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పెళ్లి గిఫ్ట్...

  • IndiaGlitz, [Friday,February 19 2021]

పెళ్లికి బహుమతులు ఏమేం ఇస్తారు? అమ్మాయి అయితే గోల్డ్ లేదంటే ఇంటికి అవసరమైన వస్తువులు.. అదే అబ్బాయి అయితే.. వాచ్ లేదంటే రింగ్ అదీ కాదంటే ఇష్టమైనవి తీసుకోమంటూ డబ్బులు ఇస్తారు. కానీ తమిళనాడులో జరిగిన ఓ వివాహంలో వధూవరులకు వారి స్నేహితులు ఇచ్చిన బహుమతులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ధరల పెరుగుదలను నిరసిస్తూ.. వధూవరులకు వారి స్నేహితులు వెల్లుల్లిపాయలు, పెట్రోల్, గ్యాస్ సిలిండర్‌ను బహుమతులుగా ఇచ్చారు.

తమిళనాడులోని పెరంబూర్ జిల్లా మధురవాయల్‌లో బుధవారం రాత్రి కార్తీక్-శరణ్యల వివాహం జరిగింది. ఈ వేడుకకు హాజరైన వారి స్నేహితులు 5 లీటర్ల పెట్రోల్‌, చిన్న ఉల్లితో మాలలు, వంటగ్యాస్‌ సిలిండర్‌ను బహుమతిగా అందజేశారు. వాటిని చూసిన బంధువులు ఆశ్చర్యపోయారు. కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజల్‌ ధరలు భారీగా పెరుగుతున్నాయి. అదే సమయంలో ఇటీవల ఆయిల్‌ సంస్థలు వంటగ్యాస్‌ ధరను కూడా పెంచాయి.

తాజాగా రాష్ట్ర మార్కెట్‌లో వెల్లుల్లిపాయ కిలో రూ.150కి చేరింది. ఈ ధరల పెరుగుదలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు వధూవరుల స్నేహితుల ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వధూవరులకు స్నేహితులు పెట్రోల్, వెల్లుల్లి దండలు గ్యాస్ సిలిండర్‌ను బహుమతిగా ఇస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లతో సందడి చేస్తున్నారు.

More News

‘లూసీఫర్’ రీమేక్‌లో నయనతార..! ఆసక్తికర విషయం ఏంటంటే..

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే తన తర్వాతి సినిమాను పట్టాలెక్కించబోతున్నారు.

రామ్, పందెంకోడి ఫేమ్ లింగుసామి కాంబినేష‌న్‌లో కొత్త చిత్రం

ఇస్టార్ శంక‌ర్ మూవీలో ప‌క్కా మాస్ క్యారెక్ట‌ర్లో న‌టించి సెన్సేష‌న‌ల్ హిట్‌ను సొంతం చేసుకున్న ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ఆవారా,

‘కపటధారి’.. ఇది వ‌ర‌కు నేను చేసిన థ్రిల్ల‌ర్స్‌కు డిఫ‌రెంట్‌గా ఉంటుంది - సుమంత్

`సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం`, `ఇదంజ‌గ‌త్‌` చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న క‌థానాయ‌కుడు సుమంత్ లేటెస్ట్ మూవీ `క‌ప‌ట‌ధారి`.

జంట హత్యల కేసుపై హైకోర్టు విచారణ

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు జంట హత్యల కేసుపై హైకోర్టు విచారణ నిర్వహించింది.

పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. ఇదే రిపీట్ ఐతే బీజేపీ పరిస్థితి?

నోట్ల రద్దు మొదలు.. నేటి వరకూ సామాన్యులపైనే భారం.. రోజువారీగా పెట్రోల్ ధరల మోత.. సిలిండర్ ధరలు పెంచి సామాన్యుడికి వాత..