తరుణ్ పెళ్లి...?
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమాల్లో మాస్టర్ నటుడిగా వచ్చిన తరుణ్ .. 'నువ్వే కావాలి' చిత్రంతో హీరోగా పరిచయమై సక్సెస్ అందుకున్నాడు. 'ప్రియమైన నీకు', 'నువ్వులేక నేను లేను' సినిమాలతో లవర్ బోయ్ ఇమేజ్ను సంపాదించుకున్నాడు.
తర్వాత తర్వాత తరుణ్ సరైన సబ్జెక్ట్స్ చేయకపోవడమో ఏమో కానీ సరైన విజయాలు దక్కలేదు. చాలా గ్యాప్ తీసుకుని తరుణ్ తెలుగులో చేస్తున్న సినిమా 'ఇది నా లవ్‌స్టోరీ'.
ఫిబ్రవరి 14న సినిమా విడుదల కానుంది. ఇవన్నీ పక్కన పెడితే..త్వరలోనే తరుణ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడని సమాచారం. త్వరలోనే ఈ విషయంపై తరుణ్ ఏదో ఒక విషయాన్ని అధికారికంగా తెలియజేస్తాడని వార్తలు వస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout