పెళ్ళికూతురైన శ్రియ

  • IndiaGlitz, [Friday,July 15 2016]

ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ద‌శాబ్ద‌కాలం దాటేసింది. మూడు ప‌దుల వ‌య‌సు కూడా దాటేసినా శ్రియ అందం ఇంకా త‌గ్గ‌నే లేదు. అందంతో పాటు అవ‌కాశాలు కూడా వ‌స్తున్నాయి. బాల‌కృష్ణ స‌ర‌స‌న గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణిలో రాణిగా క‌నిపిస్తుంటే, ఇప్పుడు మ‌రో విల‌క్ష‌ణ పాత్ర శ్రియ‌ను వ‌రించింది అయితే ఈసారి త‌మిళ సినిమాలో.

శింబు హీరోగా అధిక్ ర‌విచంద్ర‌న్ రూపొందిస్తున్న ఏఏఏ చిత్రంలో శ్రియ‌కు న‌టించే అవ‌కాశం దొరికింది. ఇందులో శ్రియ 1980 కాల‌పు అమ్మాయి పాత్ర‌లో క‌న‌ప‌డుతుంద‌ట‌. ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుగుతుంది. పెళ్ళికూతురు గెట‌ప్‌లో శ్రియ ఫోటోల‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసి 2016లో 1980 అంటూ తెలియ‌జేసింది. ఇటీవ‌ల శ్రియ శింబు త‌ల్లిపాత్ర‌లో క‌న‌ప‌డుతుంద‌నే వార్త‌ల‌కు అలాంటిదేం లేద‌ని యూనిట్ చెప్పుకొచ్చింది. మ‌రిప్పుడు శ్రియ పాత్ర గురించి తెలియాలంటే వేచి చూడాల్సిందే.

More News

జులై 29న సునీల్ 'జక్కన్న' విడుదల

సునీల్ హీరోగా,మన్నార్ చోప్రా హీరోయిన్ గా,ప్రేమకథాచిత్రమ్ తరువాత ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం 'జక్కన్న' షూటింగ్ కార్కక్రమాలు పూర్తిచేసుకుంది.

అగష్టు 13న సాయి ధరమ్ తేజ్ 'తిక్క' విడుదల

హ్యాట్రిక్ సక్సస్ ని అందుకున్న సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్,లరిస్సా బోన్సి,మన్నార చోప్రా జంటగా,సునీల్ రెడ్డి దర్శకత్వంలో, డాక్టర్.సి.రోహిన్ రెడ్డి నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ బ్యానర్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపోందిస్తున్న చిత్రం 'తిక్క'

రాహూల్ మూవీ మేకర్స్ ఎల్7

'తుంగభద్ర'ఫేమ్ అరుణ్ ఆదిత్ హీరోగా,పూజ ఝవేరి హీరోయిన్ గా మరియు ఇతరులు ప్రధాన పాత్రధారులుగా,రాహూల్ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించబడుతున్న చిత్రం 'ఎల్7'.

కామెడీ సినిమాలంటే అనే చిన్నచూపు...అందుకే నేను ఇలా చేస్తున్నాను - అల్లరి నరేష్

అల్లరి నరేష్ హీరోగా సిద్దు ఫ్రమ్ సికాకుళం డైరెక్టర్ ఈశ్వర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం సెల్ఫీ రాజా.ఈ చిత్రంలో అల్లరి నరేష్ సరసన సాక్షి చౌదరి,కామ్నా సింగ్ రనావత్ నటించారు.

దాసరి నారాయణరావుని కలిసిన 'ఫ్రెండ్ రిక్వెస్ట్ ' టీమ్

హీరో ఆదిత్య ఓం స్వీయ దర్శకత్వంలో మోడరన్ సినిమా పతాకంపై కొత్త హీరో,హీరోయిన్లతో విజయ్ వర్మ పాకలపాటి సహనిర్మాతగా నిర్మించిన యూత్ఫుల్ఎంటర్ టైనర్ 'ఫ్రెండ్ రిక్వెస్ట్'.