పెళ్ళికూతురైన శ్రియ

  • IndiaGlitz, [Friday,July 15 2016]

ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ద‌శాబ్ద‌కాలం దాటేసింది. మూడు ప‌దుల వ‌య‌సు కూడా దాటేసినా శ్రియ అందం ఇంకా త‌గ్గ‌నే లేదు. అందంతో పాటు అవ‌కాశాలు కూడా వ‌స్తున్నాయి. బాల‌కృష్ణ స‌ర‌స‌న గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణిలో రాణిగా క‌నిపిస్తుంటే, ఇప్పుడు మ‌రో విల‌క్ష‌ణ పాత్ర శ్రియ‌ను వ‌రించింది అయితే ఈసారి త‌మిళ సినిమాలో.

శింబు హీరోగా అధిక్ ర‌విచంద్ర‌న్ రూపొందిస్తున్న ఏఏఏ చిత్రంలో శ్రియ‌కు న‌టించే అవ‌కాశం దొరికింది. ఇందులో శ్రియ 1980 కాల‌పు అమ్మాయి పాత్ర‌లో క‌న‌ప‌డుతుంద‌ట‌. ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుగుతుంది. పెళ్ళికూతురు గెట‌ప్‌లో శ్రియ ఫోటోల‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసి 2016లో 1980 అంటూ తెలియ‌జేసింది. ఇటీవ‌ల శ్రియ శింబు త‌ల్లిపాత్ర‌లో క‌న‌ప‌డుతుంద‌నే వార్త‌ల‌కు అలాంటిదేం లేద‌ని యూనిట్ చెప్పుకొచ్చింది. మ‌రిప్పుడు శ్రియ పాత్ర గురించి తెలియాలంటే వేచి చూడాల్సిందే.