పెళ్లి పీటలెక్కబోతున్న యాంకర్ ప్రదీప్.. రాజకీయ నేత కూతురితో ఫిక్స్!
Send us your feedback to audioarticles@vaarta.com
బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు యాంకర్ ప్రదీప్. చాలా మంది మేల్ యాంకర్లు ఉన్నప్పటికీ స్పాంటేనియస్‌గా మాట్లాడుతూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. యాంకర్ సుమకు ఎవరైనా పోటీ ఉన్నారంటే అది ప్రదీపే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రదీప్ ఇంటర్వ్యూ అనగానే ఆయన పెళ్లికి సంబంధించిన క్వశ్చన్ ఒకటి కచ్చితంగా ఉంటూనే ఉంటుంది. ప్రదీప్ పెళ్లికి సంబంధించిన వార్తలు సైతం చాలానే వచ్చాయి. తన పెళ్లిపై తనే పంచ్‌లు వేసుకుంటూ ప్రదీప్ కాలం గడిపేస్తున్నాడు.
తాజాగా మాత్రం ఈ పంచ్‌లకు ఫుల్ స్టాప్ పడబోతున్నట్టు తెలుస్తోంది. తన బ్యాచిలర్ జీవితానికి స్వస్తి చెప్పి ప్రదీప్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడని టాక్ నడుస్తోంది. ప్రదీప్‌కి పెళ్లి ఫిక్స్ అయిందని సమాచారం. రాయలసీమకు చెందిన ఓ రాజకీయ నాయకుడి కుమార్తెతో పెళ్లికి సిద్ధం కాబోతున్నాడట. అన్నట్టు ప్రదీప్‌కి కాబోయే భార్య కూడా పొలిటీషియనేనని టాక్. మరో మూడు నెలల్లో పెళ్లి జరగబోతోందని తెలుస్తోంది. ఈ విషయమై త్వరలోనే ప్రదీప్ అధికారిక ప్రకటన చేయనున్నాడని సమాచారం. ప్రదీప్ స్పందిస్తే గానీ ఈ విషయమై క్లారిటీ రాదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout