కరోనా నెక్లెస్.. అరగంట వేసుకుంటే 80 శాతం వైరస్ అవుట్..

  • IndiaGlitz, [Monday,July 13 2020]

కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో తెలియదు. అన్ని దేశాలూ అదే పనిలో బిజిబిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇండోనేషియా వ్యవసాయ మంత్రిత్వశాఖ ఓ నెక్లెస్‌ను తయారు చేసింది. నీలగిరి ఆకులతో తయారు చేసిన ఈ నెక్లెస్ యాంటీ వైరస్‌గా పని చేస్తుందని ఆ దేశ ఆరోగ్య పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ బాలిట్‌బాంగ్తన్ తెలిపింది. ఆ నెక్లెస్‌ను మెడలో వేసుకుంటే వైరస్ దరి చేరదని, ఒకవేళ సోకినా వైరస్ నటించడం ఖాయమని బాలిట్‌బాంగన్ సంస్థ వెల్లడించింది.

700 రకాల నీలగిరి జాతికి చెందిన మొక్కలతో తయారు చేసిన ఈ నెక్లెస్‌‌ను 15 నిమిషాలు ధరిస్తే 42 శాతం.. 30 నిమిషాలు వేసుకుంటే 80 శాతం వైరస్‌ పోతుందని ఇండోనేషియా మంత్రి ఎహ్రుల్ యాసిన్ లింపో తెలిపారు. ఈ నెక్లెస్‌ను తాము ధరిస్తున్నామని తెలిపారు. అంతే కాకుండా ఈ నెక్లెస్‌ను ధరించిన వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తొలిగిపోయి కోలుకుంటున్నారని తెలిపారు. అయితే దీనికి మాత్రం ఇండోనేషియా శాస్త్రవేత్తల ఆమోదం మాత్రం లభించలేదు.

More News

తెలంగాణలో మూడు రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

తెలంగాణలో గత మూడు రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గుతూ వస్తోంది. అంతకు ముందు 1800లకు పైన నమోదైన కేసులు..

బిగ్‌బికి ధైర్యం చెప్పిన కాసేపటికే.. అనుపమ్ ఖేర్‌ ఇంట కరోనా కల్లోలం

కరోనా మహమ్మారి బాలీవుడ్‌ను భయపెడుతుంది. బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌కు కరోనా అని ఆయన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించగానే బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్

ఐశ్వర్యారాయ్.. ఆమె కూతురు ఆరాధ్యకూ కరోనా పాజిటివ్

ప్రముఖ నటి, అభిషేక్ బచ్చన్ భార్య ఐశ్వర్యారాయ్ బచ్చన్, వారి కూతురు ఆరాధ్యకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

అమితాబ్‌జీ ఆ విషయం నాకు ఇప్పటికీ గుర్తుంది: పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బిగ్‌బి అమితాబ్ బచ్చన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఓ పోస్ట్ పెట్టారు.

పవన్ ‘తొలిప్రేమ’ను టార్గెట్ చేస్తున్న వర్మ!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘పవర్ స్టార్’ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే.