కరోనా నెక్లెస్.. అరగంట వేసుకుంటే 80 శాతం వైరస్ అవుట్..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో తెలియదు. అన్ని దేశాలూ అదే పనిలో బిజిబిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇండోనేషియా వ్యవసాయ మంత్రిత్వశాఖ ఓ నెక్లెస్‌ను తయారు చేసింది. నీలగిరి ఆకులతో తయారు చేసిన ఈ నెక్లెస్ యాంటీ వైరస్‌గా పని చేస్తుందని ఆ దేశ ఆరోగ్య పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ బాలిట్‌బాంగ్తన్ తెలిపింది. ఆ నెక్లెస్‌ను మెడలో వేసుకుంటే వైరస్ దరి చేరదని, ఒకవేళ సోకినా వైరస్ నటించడం ఖాయమని బాలిట్బాంగన్ సంస్థ వెల్లడించింది.
700 రకాల నీలగిరి జాతికి చెందిన మొక్కలతో తయారు చేసిన ఈ నెక్లెస్‌ను 15 నిమిషాలు ధరిస్తే 42 శాతం.. 30 నిమిషాలు వేసుకుంటే 80 శాతం వైరస్ పోతుందని ఇండోనేషియా మంత్రి ఎహ్రుల్ యాసిన్ లింపో తెలిపారు. ఈ నెక్లెస్‌ను తాము ధరిస్తున్నామని తెలిపారు. అంతే కాకుండా ఈ నెక్లెస్‌ను ధరించిన వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తొలిగిపోయి కోలుకుంటున్నారని తెలిపారు. అయితే దీనికి మాత్రం ఇండోనేషియా శాస్త్రవేత్తల ఆమోదం మాత్రం లభించలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com