CM Jagan:ప్రతి రైతునూ ఆదుకుంటాం... సీఎం జగన్ భరోసా..
Send us your feedback to audioarticles@vaarta.com
తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన తిరుపతి, బాపట్ల జిల్లాల్లో సీఎం జగన్ పర్యటించారు. ప్రత్యేక హెలికాఫ్టర్లో తిరుపతి జిల్లాకు చేరుకున్న సీఎం అధికారులతో కలిసి వాకాడు మండలం విద్యానగర్ వెళ్లారు. అనంతరం బాలిరెడ్డి పాలెం వెళ్లి అక్కడ స్వర్ణముఖి నదికి గండిపడిన ప్రాంతాలను పరిశీలించారు. బాధితులను స్వయంగా కలిసి వారి ఆవేదనను విని చలించిపోయారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ వ్యూ ద్వారా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. తుఫాన్ బాధిత గ్రామస్థులు, రైతులతో ఆయన ముఖాముఖి సమావేశం నిర్వహించారు. నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. వారం రోజుల్లో అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామన్నారు. వర్షం వల్ల రంగు మారిన, తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, అన్నదాతలు ఆందోళన చెందాల్సిన పని లేదని ధైర్యం చెప్పారు.
వాలంటీర్ వ్యవస్థ ద్వారా సాయం..
'నాలుగైదు రోజులు భారీ వర్షం కురిసింది. మనకు వచ్చిన కష్టం వర్ణనాతీతం. వరుస వర్షాలతో రైతులు నష్టపోయారు. 92 రిలీఫ్ కేంద్రాలు పెట్టాం. 60 వేల మంది బాధితులకు 25 కేజీల రేషన్ బియ్యంతో పాటు నిత్యావసరాలను పంపిణీ చేశాం. దేశంలో ఎక్కడా లేని విధంగా మన వద్ద వాలంటీర్ వ్యవస్థ ఉంది. ప్రతి ఇంటికీ వాలంటీర్ వచ్చి రూ.2,500 ఇస్తారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. వారికి 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందిస్తాం. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తున్నాం. స్వర్ణముఖి నదిపై హైలెవల్ వంతెన నిర్మిస్తాం. దాని కోసం రూ.30 కోట్లు ఖర్చవుతుంది. అవసరమైన వారు జగనన్న హెల్ప్ లైన్ సంప్రదించాలి. వారం రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తాం' అని సీఎం జగన్ భరోసా ఇచ్చారు.
ప్రతి ఒక్కరికీ మంచే జరుగుతుంది..
పంట నష్టపోయిన పరిస్థితుల్లో ఏ ఒక్కరు ఉన్నా భయపడాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదన్నారు. అధికారులు కరెంట్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. వాలంటీర్ల ద్వారా విద్యుత్ అందిందా లేదా అనే వివరాలు తీసుకుని ప్రతి ఒక్కరికీ ఆ సమస్య లేకుండా చేస్తారన్నారు. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుందని మరోసారి మీకు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. రోడ్లు రిపేర్ చేసే కార్యక్రమాలు, టెంపరరీ పనులన్నీ మొదలు పెట్టి పునరుద్ధరణకు శ్రీకారం చూడతామన్నారు. ఈ ప్రభుత్వం మీది అన్నది గుర్తు పెట్టుకోండని.. మీ ప్రభుత్వంలో ఏ ఒక్కరికైనా మంచే జరుగుతుంది తప్ప.. చెడు అనేది ఎప్పుడూ జరగదన్నారు. ప్రతి ఒక్కరినీ బాధ్యతను కలెక్టర్లు తీసుకుంటారని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments