కాల్ చేయండి.. క్షణాల్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మీ ఇంటికే పంపిస్తాం: సోనూసూద్
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో చేతులెత్తేసింది. కాస్తో కూస్తో రాష్ట్ర ప్రభుత్వాలే లాక్డౌన్ పెట్టి కరోనా చైన్‌ను తెంపేందుకు కృషి చేస్తున్నాయి. ప్రస్తుం పెద్ద మొత్తంలో బాధితులు ఆక్సిజన్ సపోర్ట్‌పై ఉండాల్సి వస్తోంది. అయితే ఆక్సిజన్ కొరత దేశాన్ని పట్టి పీడిస్తోంది. ఈ క్రమంలోనే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ తమకు ఆక్సిజన్, మెడిసిన్, ఆసుపత్రిలో బెడ్ కోసం ప్రముఖ నటుడు సోనూసూద్‌నే ఆశ్రయిస్తున్నారు. లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఆయన తన సేవలు అందిస్తూ వస్తున్నారు. ఇక సెకండ్ వేవ్‌లో కష్టం వచ్చిన ప్రతి ఒక్కరికీ సోనూయే దిక్కవతున్నారు.
సోనూ కూడా ఏమాత్రం వెనుకాడకుండా అడిగిన వెంటనే సాయం అందిస్తూ వస్తున్నారు. సూద్ ఫౌండేషన్‌ను పెట్టి తన సభ్యుల ద్వారా సేవా కార్యక్రమాలను విస్తృతం చేశారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో కేసులు విపరీతంగా పెరగడం, అక్కడ ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉండడంతో మరో అడుగు ముందుకేసి సోనూ సేవలందిస్తున్నారు. తుష్టి ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఢిల్లీలో కరోనా బాధితులకు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఓ కాల్ సెంటర్ నంబర్ ఇచ్చారు. 02261403615 ఈ నంబర్‌కు మిస్ కాల్ ఇస్తే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ మీ ఇంటి ముందు ఉంటుందని సోనూసూద్ ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేసి తెలియచేశారు. ఇదంతా ఉచితంగా చేయడం విశేషం.
ఢిల్లీలో కేసులు బాగా పెరిగిపోతున్నాయని... అక్కడి నుంచి చాలామంది సాయం కోసం సంప్రదించారని సోనూ తెలిపారు. ఈ క్రమంలోనే మీ ఇంటికే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ వచ్చేలా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. తామిచ్చిన నంబర్‌కి ఫోన్ చేసి వివరాలు తెలియజేస్తే తమ సిబ్బంది ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మీ ఇంటి ముందు ఉంచుతారన్నారు. దీనికి ఎవరూ పైసా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. కానీ మీ పని అయిన తర్వాత ఖాళీ కాన్సెంట్రేటర్ ను తిరిగి పంపించాలని.. అది మరొకరికి ఉపయోగపడుతుందని సోనూ తెలిపారు. రెండు ఫౌండేషన్లతో కలిసి మీ నగరం కోసం చేస్తున్న చిన్న సాయమని.. అవసరంలో అండగా నిలబడడమే మనం చేయగలిగే పెద్ద సాయమని... అదే తానూ చేస్తున్నానని సోనూసూద్ పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments