టీమిండియా క్రికెటర్లను చంపేస్తాం!

టీమిండియా క్రికెటర్లను చంపేస్తామని ఓ యువకుడి నుంచి బీసీసీఐకి బెదిరింపు మెయిల్ వచ్చింది. బీసీసీఐ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్‌కు ఆ మెయిల్‌ను పంపగా.. కొన్ని గంటల్లోనే ఆ మెయిల్‌ పంపిన యువకుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. కాగా ఆ యువకుడిని అసోంకు చెందిన బ్రజ మోహన్ దాస్‌గా పోలీసులు గుర్తించారు. మోరీగావ్ జిల్లా ధర్మతుల్ ప్రాంతంలో అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి ముంబైకి తరలించారు. ఆగస్టు 20న ఆ యువకుడ్ని అరెస్ట్ చేసి.. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టడంతో అతడికి ఆగస్టు 26 వరకు పోలీస్ కస్టడీ విధించింది.

ఇంతకీ ఎవరు..!?

ఇదిలా ఉంటే.. టీమిండియా క్రికెటర్లు అంటే ఇండియాలో ఉండే క్రేజ్ ఏమిటో ప్రత్యేకంగా మరీ చెప్పాల్సిన పన్లేదు. అంతేకాదు.. క్రికెటర్లను దేవుళ్లుగా చూసే దేశం మనది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి మన టీమిండియా క్రికెటర్లనే బెదిరించడంతో అసలు ఆ యువకుడి వెనుక ఎవరున్నారు..? టెర్రరిస్టులే ఇలా చేయించారా..? ఇంతకీ ఆ మెయిల్ ఎందుకు పెట్టాడు? అనే కోణంలో విషయాలను టెర్రరిజమ్ స్క్వాడ్‌ ఆరా తీస్తోంది. మరి ఫైనల్‌గా ఈ వ్యవహారంలో ఏం తేలుతుందో వేచి చూడాల్సిందే మరి.

More News

రాజ్‌తరుణ్‌ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడుగా!

టాలీవుడ్ కుర్ర హీరో రాజ్‌తరుణ్‌ కారు సోమవారం రాత్రి నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

'దర్పణం' సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి .. సెప్టెంబర్‌ 6న విడుదల

తనిష్క్‌రెడ్డి, ఎలక్సియస్‌ జంటగా రామకృష్ణ  వెంప దర్శకత్వంలో శ్రీనంద ఆర్ట్స్‌ పతాకంపై క్రాంతి కిరణ్‌ వెల్లంకి నిర్మిస్తున్న క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'దర్పణం'..

అన్నం ముట్టని చిదంబరం.. ‘చెప్పలేను’.. ‘తెలీదు’ అంతే!

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం‌ను బుధవారం రాత్రి నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేసిన విషయం విదితమే.

‘సైరా’ విషయంలో నయన్ ఎందుకిలా చేసింది!

స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘సైరా న‌రసింహారెడ్డి’.

పూరి, విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్రానికి టైటిల్ ఖ‌రారు

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ఓ సినిమా ప్రారంభం కానుందనే సంగ‌తి తెలిసిందే.