విశాఖ ఉక్కు కోసం వీలైతే వైజాగ్ వెళ్లి పోరాడుతాం: కేటీఆర్

  • IndiaGlitz, [Wednesday,March 10 2021]

విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేయనున్నారనే వార్త ప్రస్తుతం ఏపీని కుదిపేస్తోంది. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేసి తీరుతామని కొద్ది రోజులుగా కేంద్రం సంకేతాలిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో తేల్చి చెప్పారు. దీంతో ఏపీ అగ్గి మీద గుగ్గిలమవుతోంది. అయితే ఈ సమస్యపై తాజాగా తెంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలియజేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అవసరమైతే విశాఖ వెళ్లి మరీ పోరాటంలో పాల్గొంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలను సైతం ప్రైవేటు పరం చేసేలా మోదీ వ్యవహార శైలి ఉందన్నారు.

ఏపీ ప్రజానీకం పోరాడి సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని వంద శాతం అమ్మేసే ప్రయత్నం జరుగుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయంతో వేలాది మంది ఉక్కు ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారని వారందరికీ అండగా నిలబడతామన్నారు. అవసరమైతే కేసీఆర్ అనుమతితో వైజాగ్ వెళ్లి ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొంటామన్నారు. ఎక్కడో విశాఖలో జరిగే ఉద్యమం మనకెందుకులే అనుకుంటే రేపు మన దగ్గరకు కూడా వస్తారన్నారు. ఇవాళ విశాఖ ఉక్కు అమ్ముతున్నారని.. రేపు బీహెచ్ఈఎల్‌ని కూడా అమ్మేందుకు వెనుకాడరని.. ఎల్లుండి సింగరేణిని అమ్ముతారన్నారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వీటిని కూడా ప్రైవేటు పరం చేసేయండి అంటారని కేటీఆర్ పేర్కొన్నారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర పవర్ ఉద్యోగుల సంఘం కూడా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపీ ప్రభుత్వ తీరును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొంది.

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కార్మికులకు, ఉద్యోగులకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని వెల్లడించింది. ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని తెలంగాణ రాష్ట్ర పవర్ ఉద్యోగుల సంఘం వెల్లడించింది.

More News

ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా తీరథ్ సింగ్ రావత్

ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా తీరథ్ సింగ్ రావత్ నియమితులయ్యారు. ఉత్తరాఖండ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. కాగా.. సొంత పార్టీ నేతల అసమ్మతి కారణంగా సీఎంగా త్రివేంద్ర సింగ్ రావత్ సీఎం పదవికి రాజీనామా చేశారు.

న్యూలుక్‌తో అభిమానులను మెస్మరైజ్ చేస్తున్న పవన్

దాదాపు మూడేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. అటు రాజకీయాలను.. ఇటు సినిమా షూటింగ్‌లనూ

శశికళ అందుకే వెనక్కితగ్గారా? తమిళనాట రసవత్తరంగా రాజకీయం

ఇటీవల కాలంలో తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆది నుంచి సీఎం అభ్యర్థిగా ఉండాలని భావించిన శశికళ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.

‘కేజీఎఫ్’ హీరో యశ్ తల్లిపై గొడవకు దిగిన గ్రామస్తులు

‘కేజీఎఫ్’ హీరో.. కన్నడ స్టార్ యశ్ తల్లిపై ఆమె సొంత గ్రామస్తులంతా గొడవకు దిగారు. యశ్ తల్లి తమ పొలం నుంచి ఉన్న దారిని మూసివేయడంతో ఆ గ్రామానికి చెందిన రైతులంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు

చిరుకి డీహైడ్రేషన్.. అర్థాంతరంగా నిలిచిపోయిన షూటింగ్

మెగాస్టార్ చిరంజీవి అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ‘ఆచార్య’ షూటింగ్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ షూటింగ్‌లో భాగంగా ప్రస్తుతం చిరు ఖమ్మంలో ఉన్నారు.