ఇంత రాద్ధాంతమా.. రైతులకు న్యాయం చేస్తాం: ఆర్కే
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండొచ్చేమోనన్న సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటన పెను సంచలనమైంది. ఈ ప్రకటనతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో రాజధాని రైతులు ఆందోళనకు దిగారు. రాజధాని ఇక్కడే ఉండాలని రైతులు గత వారం రోజులుగా ఆందోళన చేపడుతూనే ఉన్నారు. మరోవైపు.. తమ సమస్యలు చెప్పుకుందామంటే.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అందుబాటులో లేకుండా వెళ్లిపోయారని.. స్థానిక పోలీస్ స్టేషన్‌లో రైతులు, నియోజకవర్గ ప్రజలు మిస్సింగ్ కేసు పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే ఆర్కేను వెతిపెట్టండి అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై తాజాగా ఆళ్ల మీడియా ముందుకొచ్చి స్పందించారు.
దీనికే ఇంత రాద్ధాంతమా!?
‘సొంత పనులపై నాలుగు రోజులు హైదరాబాదుకు వెళ్లాను. అంత మాత్రానికే ఇంత రాద్ధాంతం చేస్తారా?. 40 ఏళ్లుగా చంద్రబాబు కనిపించడం లేదని కుప్పం ప్రజలు చెబుతున్నారు. దీనికి టీడీపీ నేతలు సమాధానం చెప్పాలి. ఈనెల 17న శాసనసభలో రాజధాని అంశంపై ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులు నేను ఇక్కడే ఉన్నాను. చాలా కాలం తర్వాత మా కుటుంబంలో ఒక వివాహం జరగబోతోంది. ఆ పనులపైనే నేను హైదరాబాద్‌కు వెళ్లాను. రైతు సంక్షేమం కోసం పాటుపడే పార్టీ వైసీపీ. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మేం స్వాగతిస్తాం. రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయం’ అని ఆర్కే స్పష్టం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout