ఇంత రాద్ధాంతమా.. రైతులకు న్యాయం చేస్తాం: ఆర్కే

  • IndiaGlitz, [Thursday,December 26 2019]

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండొచ్చేమోనన్న సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటన పెను సంచలనమైంది. ఈ ప్రకటనతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో రాజధాని రైతులు ఆందోళనకు దిగారు. రాజధాని ఇక్కడే ఉండాలని రైతులు గత వారం రోజులుగా ఆందోళన చేపడుతూనే ఉన్నారు. మరోవైపు.. తమ సమస్యలు చెప్పుకుందామంటే.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అందుబాటులో లేకుండా వెళ్లిపోయారని.. స్థానిక పోలీస్ స్టేషన్‌లో రైతులు, నియోజకవర్గ ప్రజలు మిస్సింగ్ కేసు పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే ఆర్కేను వెతిపెట్టండి అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై తాజాగా ఆళ్ల మీడియా ముందుకొచ్చి స్పందించారు.

దీనికే ఇంత రాద్ధాంతమా!?

‘సొంత పనులపై నాలుగు రోజులు హైదరాబాదుకు వెళ్లాను. అంత మాత్రానికే ఇంత రాద్ధాంతం చేస్తారా?. 40 ఏళ్లుగా చంద్రబాబు కనిపించడం లేదని కుప్పం ప్రజలు చెబుతున్నారు. దీనికి టీడీపీ నేతలు సమాధానం చెప్పాలి. ఈనెల 17న శాసనసభలో రాజధాని అంశంపై ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులు నేను ఇక్కడే ఉన్నాను. చాలా కాలం తర్వాత మా కుటుంబంలో ఒక వివాహం జరగబోతోంది. ఆ పనులపైనే నేను హైదరాబాద్‌కు వెళ్లాను. రైతు సంక్షేమం కోసం పాటుపడే పార్టీ వైసీపీ. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మేం స్వాగతిస్తాం. రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయం’ అని ఆర్కే స్పష్టం చేశారు.

More News

'లైఫ్ స్టైల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ !!!

కలకొండ ఫిలింస్ లైఫ్ స్టైల్ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

ఇలాంటి కథలు తెరమీద చూసి చాలా కాలం అవుతుంది... హీరో శ్రీరామ్ నిమ్మల

శ్రీరామ్, కారుణ్య కత్రేన్ జంటగా తిరుపతి యస్ ఆర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఉత్తర’.

జనవరి చివరి వారంలో రానున్న 'పలాస 1978'

మంచి కథ, కథనాలున్న సినిమాలను ప్రోత్సహించి, విడుదల చేయడానికి పెద్ద ప్రొడక్షన్ కంపెనీలు ముందుకొస్తున్నాయి.

టీడీపీలో విషాదం.. మాజీ ఎమ్మెల్యే బుజ్జి హఠాన్మరణం!

తెలుగుదేశం పార్టీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి.

బన్నీ లేకుండానే సినిమా తీసేస్తున్న సుకుమార్!

సుకుమార్, బన్నీల కాంబో ఎప్పుడూ ఆసక్తికరమే. ఆర్య, ఆర్య2 సినిమాలతో తమది హిట్ కాంబినేషన్ అని నిరూపించుకున్నారు వీళ్లు.