ఎంఐఎం అభ్యర్థులను ఓడిస్తాం: కేటీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
ఎవరైనా రాజీనామాకు సవాల్ చేస్తే తాను స్పందిస్తానని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. బల్దియాపై మళ్లీ గులాబీ జెండా ఎగరేస్తామని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ఇక ఆ ఛాన్స్ లేదని స్పష్టం చేశారు. ఎంఐఎంకు మేయర్ పదవి ఇస్తారన్న వార్తలపై సైతం కేటీఆర్ స్పందించారు. పాతబస్తీలో తాము ఐదు స్థానాల్లో గెలిచామని.. ఇప్పుడు కూడా పాతబస్తీలో తాము ఎంఐఎం అభ్యర్థులను ఓడించి గెలుస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎంఐఎంకు మేయర్ ఇస్తామనేది పిచ్చి మాట అని కేటీఆర్ కొట్టిపారేశారు. టీఆర్ఎస్ మహిళ కార్పొరేటరే గ్రేటర్ మేయర్ అవుతారన్నారు. మీ సేవ ముందు క్యూలు.. ప్రభుత్వం మీద ప్రజల విశ్వాసానికి నిదర్శనమన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత వరద సాయం మళ్ళీ అందిస్తామన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయంతోనే ప్రతిపక్షాలకు సమాధానం చెబుతామన్నారు. బీజేపీ చెప్పే మాటల్లో.. హైద్రాబాద్‌కు పనికొచ్చేది ఒక్కటైనా ఉందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర ఏర్పాటు నాటికి.. ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చిందన్నారు. రాష్ట్ర ఏర్పాటు నాటికి తెలంగాణలో అనిశ్చితి ఉండేదని.. ఈ రోజు తెలంగాణ ప్రశాంతంగా ఉండటానికి కారణం కేసీఆర్ అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 14 రోజులకు ఒకసారి నీళ్లొచ్చే దుస్థితి ఉండేదన్నారు. 2000 కోట్లతో శివారు ప్రాంతాలకు మంచి నీరు అందిస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని విద్యుత్ లోటు నుంచి మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. పీఎం పిలుపునివ్వక ముందే కేసీఆర్ స్వచ్ఛ హైద్రాబాద్‌ను ప్రారంభించారన్నారు. పారిశుధ్య నిర్వహణలో మనం నంబర్ వన్ అన్నారు.
ఇంకా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘చెత్తతో 63 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయబోతున్నాం. ఆరేళ్లలో నగరంలో పటిష్ట శాంతి భద్రతలున్నాయి. దేశంలోనే 65శాతం సిసి కెమెరాలు హైద్రాబాద్‌లో ఉన్నాయి. గుడుంబా గబ్బు, పేకాట క్లబ్బు, అల్లర్లు, మత కలహాలు, ఆకతాయిల ఆగడాలు లేవు. ఎస్ఆర్డీపీలో ఫ్లై ఓవర్లు నిర్మించాం. తెలంగాణ వచ్చాక 2లక్షల కోట్ల పెట్టుబడులు తేగలిగాం. గూగుల్, అమెజాన్ వంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 5 సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. ప్రపంచానికి వ్యాక్సిన్ హబ్ గా హైద్రాబాద్ ఉంది. మేము చెప్పింది తప్పైతే శిక్షించండి.. ఒప్పైతే ఆశీర్వదించండి. అందరి హైదరాబాద్ కావాలా కొందరి హైదరాబాద్ కావాలో ఆలోచించుకోవాలి’’ అని పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments