గ్రాఫిక్స్ వర్క్ పూర్తయిన తర్వాత..అఖిల్ మూవీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తాం : నాగార్జున
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని అఖిల్ ను హీరోగా పరిచయం చూస్తూ..సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ తెరకెక్కించిన చిత్రం అఖిల్. ఈ చిత్రాన్ని హీరో నితిన్ శ్రేష్ట మూవీస్ పతాకంపై ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దసరా కానుకగా ఈనెల 22న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. అఖిల్ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఈ విషయం పై మాట్లాడటానికి ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో నాగార్జున మాట్లాడుతూ...అఖిల్ తొలి సినిమాని ఈ నెల 22న రిలీజ్ చేయాలనుకున్నాం.
అయితే అఖిల్ సినిమాలో ఓ కీలక సన్నివేశంలో గ్రాఫిక్స్ సరిగా లేకపోవడం వలన రిలీజ్ వాయిదా వేసాం. అఖిల్ ను తెరపై చూడాలని ఫ్యాన్స్ ఎలా ఎదురుచూస్తున్నారో...నేను కూడా అలాగే ఎదురుచూస్తున్నాను. 22న రిలీజ్ చేయనందుకు బాధగా ఉంది. బాహుబలి సినిమాతో రాజమౌళి గారు ఓ స్టాండర్డ్ సెట్ చేసారు. ఆయన కూడా సినిమా బాగా రావాలని బాహుబలి సినిమాను వాయిదా వేసారు. ఆ సాండర్డ్స్ కి తగ్గకుండా ఉండాలని... గ్రాఫిక్స్ సరిగా లేనప్పుడు రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని వాయిదా వేసాం. గ్రాఫిక్స్ కి టైమ్ సరిపోకపోవడం వలన బాగా రాలేదు. గ్రాఫిక్స్ వర్క్ పూర్తయిన తర్వాత అప్పుడు అఖిల్ మూవీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తాం.అఖిల్ రిలీజ్ వాయిదా గురించి ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు.
ఫ్యాన్స్ కి నేను చెప్పేది ఏమిటంటే..నేను అఖిల్ సినిమాను చూసాను. చాలా బాగుంది. అఖిల్ డాన్స్ చూసి... నా ఇంట్లోనే ఇంత డాన్సర్ తిరుగుతున్నాడా..? అని షాక్ అయ్యాను. ఎలా నేర్చకున్నావ్ రా అని అడిగాను. రేపు రిలీజ్ తర్వాత మీరే గొప్పగా చెబుతారు. ఫస్ట్ ఫిల్మ్ బాగా రావాలని.. సినిమా వాయిదా వేసామనే విషయాన్ని నేనే అఖిల్ కి చెప్పాను. బాధపడి ఉండచ్చు. కానీ నాతో అదేమి చెప్పలేదు. అఖిల్ మూవీ ఎప్పుడు రిలీజ్ అయితే అదే మంచిరోజు అని పీలింగ్. అలాగే మంచి సినిమాను ఎప్పుడు రిలీజ్ చేసినా ఆదరిస్తారు అన్నారు. డైరెక్టర్ వినాయక్ మాట్లాడుతూ...అఖిల్ సినిమాను వాయిదా వేసినందుకు ఫ్యాన్స్ కి సారీ చెబుతున్నాను. నేను కల కని తీసిన సినిమా ఇది. గ్రాఫిక్స్ వాళ్లు టైమ్ కావాలని అడిగారు. నాగార్జున గారు ఓకె అన్నారు. సినిమా మాత్రం ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది అన్నారు. నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ...గత్యంతరం లేక సినిమాను వాయిదా వేసాం. తప్ప వేరే ఉద్దేశ్యం లేదు. అఖిల్ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout