ఎవరికి ఓటేశారో మాకు తెలిసిపోతుంది..!

  • IndiaGlitz, [Tuesday,April 16 2019]

ఇదేంటి టైటిల్ చూడగానే ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే. గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రమేశ్ కటారా ఈ వ్యాఖ్యలు చేసి అందర్నీ అయోమయంలోకి నెట్టారు. ఎన్నికల ప్రచారంలో ఓటర్లను బెదిరించేలా రమేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా బీజేపీ మంత్రులకు, నేతలకు ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. వార్తల్లో నిలవడం పరిపాటే. మంగళవారం నాడు దాహోడ్ పార్లమెంటరీ నియోజవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ జస్వంత్‌సిన్హ్ సుమన్‌బాయ్ భాభోర్ పోటీ చేస్తున్నారు. ఆయన తరపున ఎమ్మెల్యే రమేశ్ ఖటార్ ఇవాళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కాగా ఇప్పటికే పలువురు నేతలకు ఎన్నికల కమిషన్ చీవాట్లు పెట్టి బ్యాన్ విధించిన విషయం అందరికీ తెలిసిందే.

అసలు ఆయన ఏమన్నారు..!?

కాంగ్రెస్ పార్టీకి ఎవరెవరు ఓటేశారో పసిగట్టేందుకు పోలింగ్ బూత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సీసీ కెమేరాలు పెట్టారు. ఈ సీసీ కెమేరాలు పెట్టడంతో ఎవరు కాంగ్రెస్‌కి ఓటేశారో, ఎవరు బీజేపీకి ఓటేశారో తెలిసిపోతుంది. మీ పోలింగ్ బూత్ నుంచి ఓట్లు తక్కువగా వస్తే.. అప్పుడు ఆయనకు ఎవరు ఓటేయలేదో తెలిసిపోతుంది. దీంతో మీరు బీజేపీకి మీరు బీజేపీకి ఓటేశారో తెలిసిపోతుంది. ఎక్కడైతే బీజేపీకి తక్కువ ఓట్లు వచ్చాయో ఆ ప్రాంత అభివృద్ధికి తక్కువ నిధులు కేటాయిస్తాం అని బహిరంగంగా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసే వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ మాటలు అనడంతో సభకు హాజరైన ప్రజలంతా షాకయ్యారు. అంతటితో ఆగని ఆయన ప్రధానమంత్రికి ఎవరు ఓటు వేయలేదో వాళ్లకు ఉద్యోగాలు రావంటూ బెదిరింపులకు దిగడం గమనార్హం. ప్రస్తుతం ఈయన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఈ వ్యవహారంపై గుజరాత్‌ కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ త్వరలోనే బీజేపీ ఎమ్మెల్యేపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను, బీజేపీ అధిష్టానాన్ని డిమాండ్‌ చేసింది. అంతేకాదు దీనిపై ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించి తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. కాగా.. లోక్‌సభ మూడో దశ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 23న గుజరాత్‌లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

More News

రేసు గుర్రాల్లా దూసుకుపోయిన స్టాక్‌మార్కెట్లు

దేశీయ స్టాక్‌మార్కెట్లు నాలుగో రోజు కూడా లాభాలతో రేసు గుర్రాల్లా దూసుకుపోయాయి.

కిమ్‌తో నాలుగోసారి చర్చకు సిద్ధమైన మూన్‌ జే

ఉత్తర కొరియా-దక్షిణ కొరియా అధ్యక్షుల మధ్య ఇప్పటికే చర్చలు జరిగిన విషయం విదితమే. అయితే చర్చలు విఫలం కావడంతో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో నాలుగోసారి

ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ అనుమానాస్పద మృతి

ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ తివారీ దేశ రాజధాని ఢిల్లీలో అనుమానాస్పద స్థితిలో కన్నుమూశాడు.

మెట్రోలో ప్రయాణిస్తున్న మహిళలూ తస్మాత్ జాగ్రత్త...

మెట్రోలో ప్రయాణించాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. రైలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా అంతే సంగతులు.

నిహారిక కోసం సుకుమార్‌

మెగా ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలు తెలుగు సినిమాకు ప‌రిచ‌య‌మ‌య్యారు. అయితే ఈ ఫ్యామిలీ నుండి ప‌రిచ‌య‌మైన హీరోయిన్ నిహారిక కొణిదెల మాత్ర‌మే.