కరోనాతో కలిసి బతకాల్సిందే..: కేసీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌తో మనం కలిసి బతకాల్సిందేనని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనాతో కలిసి జీవించడం అలవాటు చేసుకోవాలని.. ఈ మహమ్మారి రేపో మాపో పోయేది కాదన్నారు. ఉపాయం ఉన్నవాడు అపాయాన్ని తప్పించుకుంటాడన్నారు. రేపో ఎల్లుండో వారం రోజులకో దాటిపోయే గండం కాదని.. ఇది మనల్ని వేటాడుతూనే ఉంటుందన్నారు. ఇప్పటి వరకూ మనల్ని మనం ఉపాయంతో రక్షించుకున్నామని రానున్నరోజుల్లో కూడా ఉపాయంతోనే రక్షించుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ‘మనల్ని మనమే రక్షించుకోవాలి.. ఎవరో వచ్చి మనల్ని కాపాడరు’ అని మరోసారి కేసీఆర్ స్పష్టం చేశారు.
ఇప్పటికే పలువురి నోట..
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో ఈ నెల 29 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు రాష్ట్ర కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఇవాళ 7 గంటల పాటు సుధీర్ఘ కేబినెట్ భేటీ అనంతరం సీఎం మీడియా మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ మే-17తో ముగియనుండటంతో.. దాన్ని మరింత పెంచుతున్నట్లు ప్రకటించారు. కాగా.. కరోనాతో కలిసి బతకాల్సిందేనని ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, పలు రంగాలకు చెందిన ప్రముఖులు.. ఆఖరికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్పిన విషయం తెలిసిందే. ఇదివరకే తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఓ ఇంటర్వ్యూ వేదికగా ఈ వ్యాఖ్యలే చేశారు.
జగన్‌తో పాటు అందరీ నోటా...
‘కరోనా మహమ్మారిని ఇప్పటికిప్పుడు నిర్మూలించే పరిస్థితి లేదు. కాబట్టి దాంతో కలిసే సహజీవనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. నాకైనా, మీకైనా ఇంకెవరికైనా ఈ వైరస్ సోకవచ్చు.. అందుకు భయపడాల్సిన పనిలేదు. ఇది కూడా సాధరణ జ్వరమే’ అని ఇటీలే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం విదితమే. అయితే.. కరోనాతో సహజీవనం ఏంటి..? అసలు జగన్ ఏం మాట్లాడుతున్నారంటూ ప్రతిపక్షాలు ఒంటికాలిపై లేచాయి. అంతటితో ఆగని విమర్శకులు.. ‘అందరూ కరోనాకు విడాకులు ఇవ్వాలనుకుంటుంటే.. జగన్ మాత్రం సహజీవనం చేయాల్సి ఉంటుంది’ అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
ప్రముఖుల నోట కూడా అదే మాట..
అయితే చివరికి.. ఎస్.. ఇది నిజమే అని ప్రధాని నరేంద్ర మోదీ, పలుదేశాల అధిపతులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, పలువురు శాస్త్రవేత్తలతో పాటు ఇన్ఫోసిస్ నారాయణ సైతం జగన్ మాటలను ఏకీభవించారు. దీంతో ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు, నెట్టింట్లో విమర్శించిన వారి గొంతులో వెలక్కాయపడ్డట్లు అయ్యింది. రెండ్రోజుల క్రితం ట్విట్టర్ వేదికగా ఆయన.. ‘ఢిల్లీనీ రీ- ఓపెన్ చేయాల్సిన సమయం వచ్చింది.. మనం కరోనా వైరస్‌తో కలసి జీవించడానికి సిద్ధం కావాలి’ అని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ట్వీట్ చేశారు. అంటే.. లాక్ డౌన్ ఎత్తేయడానికి రెడీగా ఉన్నామని ఇందుకు కేంద్రం సహకరించాలని పరోక్షంగా ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. కాగా.. వైఎస్ జగన్ మాటలను మీడియా ముఖంగా, సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. కానీ చివరికి చూస్తే అందరి నోటా అదే మాట వచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments