ప్రపంచంలో నంబర్ 1 టెర్రరిస్ట్‌ను చంపేశాం.. ట్రంప్
Send us your feedback to audioarticles@vaarta.com
అమెరికన్ సైనికులు చుట్టుముట్టిన వేళ, వాళ్లకు చిక్కరాదన్న ఉద్దేశంతో ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీ, ఆత్మహత్య చేసుకున్నట్టు యూఎస్ మీడియా ఈ ఉదయం ప్రత్యేక కథనాలను ప్రచురించింది. సిరియాలోని ఉగ్రవాదుల స్థావరాలపై అమెరికన్ సైన్యం దాడులు చేసేందుకు ట్రంప్ అనుమతించిన తరువాత, ఐసీస్ కీలక ప్రాంతాలను సైన్యం చుట్టుముట్టింది. ఈ నేపథ్యంలో అమెరికన్ సైన్యం దగ్గరకు వచ్చిందని తెలుసుకున్న అల్ బాగ్దాదీ, ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. సిరియా, ఇరాక్ దేశాల్లో సొంత ఇస్లామిక్ రాజ్యాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో అల్ బాగ్దాదీ, ఐసిస్‌ను స్థాపించిన సంగతి తెలిసిందే. ఇక, అల్ బాగ్దాదీ చంపబడ్డాడా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న విషయమై పూర్తి స్పష్టత రాలేదు.
ట్రంప్ అధికారిక ప్రకటన...
సిరియాలో ఐసిస్ స్థావరాలపై అమెరికా దాడులు చేసిన విషయం విదితమే. ఉగ్రవాదుల స్థావరాలపై అమెరికన్ సైన్యం దాడులు చేసేందుకు ట్రంప్ అనుమతించిన అనంతరం రంగంలోకి దిగి.. ఐసీస్ కీలక ప్రాంతాలను సైన్యం చుట్టుముట్టింది. ఈ నేపథ్యంలో అమెరికన్ సైన్యం దగ్గరకు వచ్చిందని తెలుసుకున్న అల్ బాగ్దాదీ తనకు తానుగా ఆత్మహత్య చేసుకున్నాడు!. అయితే ఈ దాడులు, బాగ్దాది ఆత్మహత్యపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. బాగ్దాదీ మృతిని ట్రంప్ అధికారికంగా ప్రకటించారు.
బాగ్దాదీనే అని డీఎన్ఏ టెస్ట్‌లో తేలింది!
‘ఐసీస్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించాం. దాడి సమయంలో బాగ్దాదీ సొరంగంలో దాక్కున్నాడు. రెండు గంటలపాటు ఆపరేషన్ కొనసాగింది. బలగాలను చూసి బాగ్దాది తనను తాను పేల్చుకున్నాడు. బాగ్దాదితో సహా ముగ్గురు పిల్లలు కూడా చనిపోయారు..
డీఎన్ఏ టెస్ట్‌లు బాగ్దాది మృతిని ధృవీకరించాయి. ప్రపంచంలో నం.1 టెర్రరిస్ట్ బాగ్దాది. 2014 నుంచి ఇరాక్-సిరియాల్లో అత్యధిక ప్రాంతాల్లో బాగ్దాది పాలన నడించింది. ఆత్మహుతి దాడిలో బాగ్దాది దేహం చిద్రమైంది. డీఎన్ఏ టెస్ట్‌ల ద్వారా బాగ్దాదీయేనని తెలిసింది. నెల క్రితమే బాగ్దాది స్థావరాన్ని గుర్తించాం. కుర్దులు ఇన్‌ఫార్మర్లుగా ఉపయోగపడ్డారు. రెండు వారాల క్రితమే అతడి సొరంగంపై దాడికి ప్లాన్ చేశాం. నాకు మా సైన్యం మూడు రోజుల క్రితమే ప్లాన్ వివరించింది. రష్యా, టర్కీ, ఇరాక్‌లకు ముందే చూచాయిగా చెప్పాం. బాగ్దాదీపై ఛేజ్‌లో మిలిటరీ కుక్కలను వాడుకున్నాం. మా కుక్కల్లో ఒకటి గాయపడింది’ అని ట్రంప్ ప్రకటించారు. సిరియా, ఇరాక్ దేశాల్లో సొంత ఇస్లామిక్ రాజ్యాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో అల్ బాగ్దాదీ, ఐసిస్ ను స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇక చేసేదేమీ లేక అమెరికా సైన్యానికి ట్రంప్ ఫుల్ పవర్స్ ఇవ్వడంతో ఈ దాడులకు పాల్పడింది.
బాగ్దాది ఆత్మహత్య వెనుక ‘ఆమె’!
కాగా.. బాగ్దాదీ మృతి వెనక ఓ మహిళ ఉన్నట్లు ఆసక్తికర విషయం వెలుగుచూసింది. ఆమె ఇచ్చిన సమాచారం వల్లనే బగ్దాదీపై అమెరికా దళాలు బాంబుల వర్షం కురిపించగలిగాయని సమాచారం. చివరికి తప్పించుకోలేని పరిస్థితుల్లో బాగ్దాదీ తనను తాను పేల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఐసిస్‌లో కీలక ఉగ్రవాది అయిన నిస్రిన్ ఇబ్రహీం భర్త 2015 మేలో ప్రాణాలు కోల్పోయాడని.. తూర్పు సిరియాలోని అల్-ఒమర్ చమురు క్షేత్రంపై జరిగిన దాడిలో అతడు మృతి చెందాడు. ఆ తర్వాత నిస్రిన్ పోలీసులకు చిక్కింది. పోలీసుల అదుపులో ఉన్న ఆమె ఐసిస్‌కు సంబంధించిన కీలక విషయాలను అమెరికా నిఘా సంస్థ సీఐఏ, కుర్దిష్ ఇంటెలిజెన్స్ సంస్థలకు అందించేందుకు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.
కొత్త వారుసుడొచ్చాడు!
ఇదిలా ఉంటే బాగ్దాది ఆత్మహత్య అనంతరం ఐసిస్‌కు కొత్త వారసుడి నియామకం జరిగిపోయిందని వార్తలు వస్తున్నాయి. అబ్దుల్లా ఖర్దాష్‌ను బాగ్దాదీకి వారసుడిగా, ఐసిస్ కొత్త అధినేతగా నియమించినట్టు తెలుస్తోంది. కాగా, ఈ సంవత్సరం ఆగస్టులోనే తనకేదైనా జరిగితే వారసుడిగా అబ్దుల్లా ఖర్దాష్ అలియాస్ హాజీ అబ్దుల్లా అల్ అఫ్తారీని నియమించాలని బాగ్దాదీ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout