ఆ హీరోయిన్ వల్లే విడిపోయాం - బాలీవుడ్ జంట
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ నటుడు పులకిత్ సమ్రాట్, శ్వేత రోహిర ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే...ఏమైందో ఏమో కానీ పులకిత్, శ్వేత రోహిర విడిపోయారు. పులకిత్ తో విడిపోవడం గురించి శ్వేత రోహిర ఇటీవల ఇచ్చిన ఇంటర్ వ్యూలో తెలియచేస్తూ....పులకిత్, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మేము మొదట్లో బాగానే ఉండేవాళ్లం. యామీ గౌతమ్ తో పులకిత్ కి అనుబంధం ఏర్పడ్డాక మా ఇద్దరి మధ్య కలతలు వచ్చాయి. యామీ గౌతమ్ వలనే మేము విడిపోయాం అని శ్వేత రోహిర తెలియచేసారు.
అయితే పులకిత్ మరోలా స్పందించాడు. శ్వేతతో కలిసుండలేను. మా వివాహ బంధం తెగిపోయింది అని ప్రకటించాడు. సానుభూతి పొందేందుకు శ్వేత నా ఇమేజ్ దెబ్బతీస్తుంది. ఆమెతో ఎలాంటి సంబంధం లేదు. మా వివాహ బంధం ఇక ముగిసినట్టే అని పులకిత్ ప్రకటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout