మాకు 'పీకే' వద్దు, ఏపీలో చనిపోతుంది అని తెలుసు: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి!
Send us your feedback to audioarticles@vaarta.com
ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ చీఫ్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రసంగం కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. రేవంత్ రెడ్డికి మాస్ పొలిటీషియన్ గా ఇమేజ్ ఉంది. ఇది తెలంగాణలో పార్టీకి లభిస్తుందని కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ని పిసిసి చీఫ్ గా ప్రకటించింది.
బాధ్యతలు చేపట్టాక రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్ వద్ద ఏర్పాటు చేసిన సభలో రేవంత్ మాట్లాడారు. తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు సోనియా గాంధీ తనకు ఈ భాద్యతలు అప్పగించారు అని రేవంత్ అన్నారు. పోచమ్మ, ఎల్లమ్మ, లక్ష్మీనరసింహ స్వామి దయతో పాటు సోనియమ్మ ఆశీస్సులతో ఈ బాధ్యతలు చేపడుతున్నట్లు రేవంత్ తెలిపారు.
రాష్ట్రంలో 4 కోట్లమంది నలుగురి చేతిలో బందీలుగా మారారు. కేసీఆర్ వచ్చాక రైతుల ఆత్మహత్యలు, ఎకౌంటర్లు ఆగడం లేదు. గులాబీ చీడను తరిమికొట్టేవరకు పోరాటం చేయాలి. తెలంగాణ పోరాటంలో అమరులైన వీరుల త్యాగాలు ఫలించాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాహుల్ గాంధీ మన సైన్యాన్ని ముందుండి నడిపిస్తారు. మన తెలంగాణ తల్లి.. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ.
నాలుగు కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లల్లో సోనియమ్మ గుడి కట్టుకోవాలి. ఇదే నినాదంతో మనం ప్రజల వద్దకు వెళ్ళాలి. ఏపీలో కాంగ్రెస్ పార్టీ చనిపోతుంది ముందే తెలుసు. అయినప్పటికీ తెలంగాణ ఇచ్చారు. కాబట్టి సోనియమ్మకు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది.
చాలా మంది పీకే(ప్రశాంత్ కిషోర్) ని సలహా దారునిగా పెట్టుకోవాలని సూచిస్తున్నారు. మంచిదే.. కాలం అవసరం లేదు. పాదరసం లాంటి ప్రతి కార్యకర్త పీకేనే అని రేవంత్ అన్నారు. ప్రతి కార్యకర్త రెండేళ్ల పాటు కుటుంబ సభ్యులకు సెలవు పెట్టి పార్టీ కోసం పోరాటం చేయాలని పిలుపు ఇచ్చారు.
తన గురించి అనుకూలంగా నినాదాలు చేస్తున్న వారిని రేవంత్ వారించారు. రాహుల్, సోనియా నినాదాలు తప్ప మరొకరి నినాదం వినిపించకూడదు. పార్టీలో వ్యక్తిగత నినాదాలకు తావు లేదు. అది పార్టీకి తీరని నష్టం చేకూరుస్తుంది అని రేవంత్ అన్నారు. వ్యక్తిగత నినాదాలు చేసేవారిపట్ల కఠినంగా ఉంటానని రేవంత్ హెచ్చరించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout