అంత డబ్బులు పెట్టి కొంటే తినాలో తినకూడదో తెలియదు: పూరీ జగన్నాథ్
Send us your feedback to audioarticles@vaarta.com
'ఒక కిలో దాదాపు నలబై లక్షలు ఖర్చు పెట్టి చేప గుడ్లని కొంటే తినాలో తినకూడదో అర్థం కాదు' అని అంటున్నారు స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. పూరీ మ్యూజింగ్స్‌లో భాగంగా పూరీ జగన్నాథ్ 'స్కావియర్' గురించి మాట్లాడారు. "కేవియర్‌ని ఖరీదైన చేప అంటారు. నిజానికి అవి చేప కాదు.. చేప గుడ్లు. ఆ గుడ్లు పెట్టే చేప పేరు స్టజ్జన్. 250 మిలియన్ ఇయర్స్ నుండి ఆ చేప ఉంది. చల్లటి నీటిలో పెరుగుతుంది. కాస్పియన్, నల్ల సముద్రాల్లో దొరుకుతుంది. ఒక్కొక్క చేప 3000 ఎల్‌బీ బరువుంటుంది. ఆడ స్టజ్జన్ పెట్టే గుడ్లను బెర్రీస్ అంటారు. కొంతమంది వాటిని ముత్యాలని కూడా అంటారు. ఎందుకంటే, ఆ గుడ్లు నిజంగానే ముత్యాల్లాగా మెరుస్తుంటాయి. రష్యా, ఇరాన్ ప్రాంతాల్లో ఎక్కువ కేవియర్‌ను ఉత్పత్తి చేస్తారు. అలాగే చైనా, యూరప్ దేశాల్లోనూ కేవియర్‌ను ఉత్పత్తి చేస్తుంటారు. పూర్వం బ్రిటీష్, పర్షియన్ రాజులు మాత్రమే వీటిని తినేవారు. దీన్ని రాయల్ ఫిష్ అనేవారు.
కావియార్ అనే పర్షియన్ పదం నుండి ఈ పేరుని పెట్టారు. అరిస్టాటిల్‌కు కూడా ఈ కేవియర్ అంటే చాలా ఇష్టం. చాలా ఖరీదైన ఫుడ్. ఇప్పుడు కేవలం ఫైవ్‌స్టార్ హోటల్స్‌లో దొరుకుతాయి. ఎమిరేట్స్ ఫ్లైట్స్‌లో ట్రావెల్ చేసేవారికి వీటిని సర్వ్ చేస్తారు. పారిస్, రోమ్ వంటి దేశాల్లో కేవియర్‌కు సంబంధించిన ప్రత్యేకమైన హోటల్సే ఉంటాయి. వాటికెళితే మనకు బెస్ట్ కేవియర్ దొరుకుతుంది. గ్రే, బ్లాక్, బ్రౌన్, రెడ్ ఇలా చాలా కలర్స్‌లో కేవియర్ దొరుకుతుంది. స్టజ్జన్ ఎంత ముసలిదైతే కేవియర్ అంత ఖరీదు . ఖరీదైన కేవియర్‌ను ఆల్మాస్ అంటారు. ఒక కిలో ఎగ్స్ పదివేల డాలర్స్. చాలా కాస్ట్‌లీ కేవియర్ ఎగ్స్ నలబై వేల పౌండ్స్. .. అంటే దాదాపు నలబై లక్షలు. అంత పెట్టి కొంటే దాన్ని తినాలో తినకూడదో తెలియదు. ఇందులో సోడియం, కాల్షియం, ప్రొటీన్, సెలీనియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. బీ 12, బీ6 వంటి విటమిన్స్ ఉంటాయి. ఇరానీ ఆల్మాస్ కేవియర్ అయితే ఒక కిలో ముప్పై ఐదు వేలు. అమెజాన్ కూడా అమ్మతుంటారు. కుదిరితే సరదాగా ఎప్పుడైనా ట్రై చేయండి" అన్నారు పూరీ జగన్నాథ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout