‘ప్రేమపిపాసి’ సక్సెస్ పై  కాన్ఫిడెంట్ గా ఉన్నాం - చిత్ర నిర్మాత  పి ఎస్ రామకృష్ణ(ఆర్‌.కె)

  • IndiaGlitz, [Monday,March 09 2020]

సినిమా రంగంలో రాణించాంటే ప్యాషన్‌ ఉంటేనే సరిపోదు.. పక్కా ప్రణాళిక కూడా అవసరమే అంటున్నారు నిర్మాత రామకృష్ణ(ఆర్‌.కె). పదేళ్లకు ముందు చిన్నపాటి మొత్తంతో కన్‌స్ట్రక్షన్‌ రంగంలోకి అడుగు పెట్టి ప్రణాళిక, దీక్ష, బాధ్యతతో క్రమంగా ఉన్నతస్థాయికి చేరుకున్నారు ఆర్‌.కె. ఈయన నిర్మాతగా రూపొందిన డిఫరెంట్ ల‌వ్‌ ఎంటర్‌టైనర్‌ ‘ప్రేమపిపాసి’. ఎస్‌.ఎస్‌.ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌, యుగ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై రాహుల్‌ భాయ్‌ మీడియా మరియు దుర్గశ్రీ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మురళీరామస్వామి (ఎమ్‌.ఆర్‌) దర్శకత్వం వహించగా జీపీఎస్‌, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షివర్మ హీరో హీరోయిన్స్‌గా నటించారు. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 13న గ్రాండ్‌గా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత రామకృష్ణ(ఆర్‌.కె)తో ఇంటర్వ్యూ...

నేపథ్యం..?

మాది విజయవాడ. నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి. నా చదువంతా కాకినాడలోని సాగింది. ఎం.కామ్‌, ఎంబీఏ చదివాను. 2000 సంవత్సరంలో హైదరాబాద్‌ వచ్చాను. గత 20 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నాను. అలాగే గత పదేళ్లుగా కన్‌స్ట్రక్షన్‌ బిజినెస్‌ చేస్తున్నాను. 2010 చిన్నగా ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టాను. క్రమంగా డెవప్‌ చేసుకుంటూ వచ్చాను. ప్రస్తుతం విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టు దగ్గర పెద్ద ప్రాజెక్ట్‌ ఒకటి కన్‌స్ట్రక్ట్‌ చేస్తున్నాను. గతం లో ఒక షార్ట్ ఫిలిం లో నటించాను. అలాగే నిర్మాతగా కూడా వ్యవహరించాను. మా హీరో, డైరెక్టర్‌ చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేయడానికి ఈ రంగంలో అడుగుపెట్టాను.

డైరెక్టర్‌ కథ చెప్పగానే ఏమనిపించింది?

కథ వినే సమయంలో కథను జడ్జ్‌ చేసేంత కెపాసిటీ లేదు. అయితే డైరెక్టర్‌ కథను చెప్పిన విధానం, వారికి కథపై ఉన్న నమ్మకం చూసి వాళ్లపై నమ్మకం కలిగింది. వాళ్లను వాళ్లు ప్రూవ్‌ చేసుకుంటామని చెప్పారు. అందుకనే సినిమా చేయడానికి రెడీ అయ్యాను.

సినిమా రిలీజ్‌ ముందు ఎలాంటి రెస్పాన్స్‌ ఉంది?

చాలా బావుందండీ!.. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మేం చేసిన ట్రైర్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సినిమాను చూసిన వారందరూ బావుందని మెచ్చుకున్నారు. అలాగే సినిమా సెన్సార్‌ కూడా పూర్తయ్యింది. సినిమా చూసిన సెన్సార్‌ అధికాయి సినిమా బావుందని అప్రిషియేట్‌ చేశారు. మార్చి 13న సినిమాను విడుద చేస్తున్నాం. సినిమా చేయడం ఒక ఎత్తు అయితే.. సినిమా రిలీజ్‌ చేయడం మరో ఎత్తు అని ఈ సినిమాతో తెలిసింది.

ఫస్ట్‌ కాపీ చూసిన తర్వాత మీకెలా అనిపించింది?

సినిమా చాలా బాగా వచ్చిందనిపించింది. డైరెక్టర్‌ మురళీ రామస్వామిగారు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఫస్ట్‌ టైమ్‌ డైరెక్టర్‌లా కాకుండా ఎక్స్‌పీరియెన్స్‌డ్‌ డైరెక్టర్‌లా కాకుండా అనుభవమున్న సినిమాను తెరకెక్కించారు. ఇక హీరో జీపీఎస్‌ యాక్టింగ్‌ సినిమాకు ప్లస్‌ అయ్యింది. తను స్టేజ్‌ ఆర్టిస్ట్‌. చక్కగా నటించాడు. తనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. హిందీ లో ఇమ్రాన్ హష్మీ తరహాలో మా హీరో జిపిఎస్ కి ఈ సినిమాతో లిప్ లాక్ హీరో గా పేరు వస్తుంది.

సినిమాలో ప్లస్‌ పాయింట్స్‌ ఏంటి?

ఏదయినా సినిమాకి ఆడియన్స్ రావాలంటే ముఖ్యంగా కథ, ఎంటర్ టైన్మెంట్, సంగీతం బాగుండాలి. మా సినిమాలో ఇవి చక్కగా కుదిరాయి. వాటితో పాటు స్టూడెంట్స్ కి కావాల్సిన బోల్డ్ కంటెంట్ కూడా ఉంది. అందుకనే సక్సెస్ పై కాన్ఫిడెంట్ గా ఉన్నాం. కథను సారంగానే బోల్డ్ కంటెంట్ పెట్టడం జరిగింది.

నిర్మాతగా ఎలాంటి సినిమాు చేయానుకుంటున్నారు?

ఏడాదికి ఓ సినిమా చేసినా మంచి సినిమా చేయానుకుంటాను. మా బ్యానర్‌ నుండి సినిమా వస్తుందంటే.. మంచి సినిమా వస్తుందని ప్రేక్షకుడు అనుకోవాలి. అన్నీ జోనర్‌ సినిమాలు చేస్తాను. ప్రస్తుతం ముగ్గురు దర్శకుతో చర్చ‌లు జరుపుతున్నాం. త్వ‌ర‌లోనే ఏ కథతో సినిమా చేయానే దానిపై ఓ నిర్ణయం తీసుకుని తెలియజేస్తానంటూ ఇంటర్వ్యూ ముగించారు నిర్మాత రామకృష్ణ(ఆర్‌.కె).

More News

సీసాలతో కొట్టడమేంటి.. చంపేస్తారా..? : ప్రకాష్ రాజ్

తెలుగు బిగ్ బాస్-3 విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై కొన్నిరోజుల క్రితం పబ్‌లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు రిషిక్ రెడ్డి గచ్చిబౌలిలోని

పాన్ ఇండియా సినిమా నుండి త‌ప్పుకున్న నాగ్‌!!

బాహుబ‌లి, కె.జి.య‌ఫ్ పార్ట్ 1 త‌ర్వాత ద‌క్షిణాది నుండి పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా విడుద‌ల‌వుతున్నాయి.

ఏపీ నుంచి ‘పెద్దల’ సభకు వీళ్లే.. పక్కా వ్యూహంతో జగన్!

ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్దల సభకు వెళ్లే అభ్యర్థులను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేసేశారు.

మీ ప‌ని మీరు స‌రిగ్గా చేయండి.. నా ప‌ని న‌న్ను చేసుకోనివ్వండి: రానా

టాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు రానా ద‌గ్గుబాటి ముంబైకి మీడియాకు చెందిన ఓ జ‌ర్న‌లిస్ట్‌పై మండిప‌డ్డారు.

అమృతపై బాబాయ్ శ్రవణ్ షాకింగ్ కామెంట్స్

మారుతీరావు ఆత్మహత్యపై తనకు చాలా వరకు బాబాయ్ శ్రవణ్‌పైనే అనుమానాలున్నాయని అమృత మీడియా ముందు వెల్లడించింది.